AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato-Chillies Price Hike: టమాటా బాటలో పయనిస్తున్న పచ్చి మిర్చి .. కిలో రూ.400.. మరింత పెరిగే అవకాశం ఉందంటూ..

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పచ్చిమిర్చి ధర కిలో రూ.100 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో సెంచరీ దాటింది. ఇక కొన్ని ప్రాంతాల్లో దాని ధర కూడా కిలో రూ.400లకు చేరుకుంది. కోల్‌కతాలో పచ్చిమిర్చి కిలో రూ.400కి చేరింది. ఇటీవలే వీటి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Tomato-Chillies Price Hike: టమాటా బాటలో పయనిస్తున్న పచ్చి మిర్చి .. కిలో రూ.400.. మరింత పెరిగే అవకాశం ఉందంటూ..
Greeen Chilli
Surya Kala
|

Updated on: Jul 04, 2023 | 9:20 AM

Share

వేసవి తాపం వెళ్ళిపోతూ రుతుపవనాలు.. అడుగు పెట్టి తొలకరి జల్లులు పలకరించాయి. అయితే గత కొన్ని రోజులుగా కూరగాయలు, వెల్లుల్లి, అల్లం వంటి వస్తువుల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా  టమాటా కిలో సెంచరీ దాటి రెండు వందల రూపాయలకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పుడు అదే బాటలో మిర్చి ధర కూడా పయనిస్తోంది. మిర్చి ధర మండిపోయింది. టమాటా ధర 100 దాటిన తర్వాత ఇప్పుడు మిర్చి కూడా మార్కెట్‌లో 400 రూపాయలు దాటుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పచ్చిమిర్చి కిలో రూ.300 నుంచి 400లకు చేరింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వర్షాకాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రాష్ట్రాల్లో పచ్చి మిర్చి రూ. 400

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పచ్చిమిర్చి ధర కిలో రూ.100 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో సెంచరీ దాటింది. ఇక కొన్ని ప్రాంతాల్లో దాని ధర కూడా కిలో రూ.400లకు చేరుకుంది. కోల్‌కతాలో పచ్చిమిర్చి కిలో రూ.400కి చేరింది. ఇటీవలే వీటి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వర్షం కారణంగా పచ్చిమిర్చి దిగుబడి తగ్గి.. మార్కెట్ లో రాక తగ్గడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దిగుబడి తగ్గిన పచ్చిమిర్చి

గత వారం పచ్చిమిర్చి దిగుబడి 80 టన్నులకు తగ్గింది. చెన్నైకి రోజువారీ అవసరం 200 టన్నులు. పచ్చి మిరపకాయలకు డిమాండ్‌ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచి వచ్చే సరుకుల ద్వారానే తీరుతుంది. అయితే పచ్చిమిర్చి కొరతతో డిమాండ్ పెరిగి ధర పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు గత పంటలో తమ మిర్చికి మంచి ధర లభించకపోవడంతో ఇతర పంటలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఫలితంగా పచ్చిమిర్చి దిగుబడి తగ్గి.. ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..