LPG Price Hiked: సామాన్యుడికి షాక్‌.. గ్యాస్‌ బండ రేట్లు మళ్లీ పెరిగాయ్‌! సిలిండర్​ ధర ఎంతంటే?

ఆయిల్‌ కంపెనీలు సామాన్యుడికి షాకిచ్చాయి. కమర్షియల్​ ఎల్‌పీజీ గ్యాస్​సిలిండర్ల ధరలను అదనంగా రూ.7 వరకు పెంచుతూ మంగళవారం (జులై 4) నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర..

LPG Price Hiked: సామాన్యుడికి షాక్‌.. గ్యాస్‌ బండ రేట్లు మళ్లీ పెరిగాయ్‌! సిలిండర్​ ధర ఎంతంటే?
LPG Gas Price Hikes
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2023 | 2:27 PM

న్యూఢిల్లీ: ఆయిల్‌ కంపెనీలు సామాన్యుడికి షాకిచ్చాయి. కమర్షియల్​ ఎల్‌పీజీ గ్యాస్​సిలిండర్ల ధరలను అదనంగా రూ.7 వరకు పెంచుతూ మంగళవారం (జులై 4) నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. ఐతే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఆయిల్ కంపెనీలు గ్యాస్​సిలిండర్ల రేట్లలో మార్పు చేస్తుంటాయి. జులై నెల ప్రారంభమైన మూడు రోజుల తర్వాత గ్యాస్ రేట్లు పెంచి అందరికీ షాకిచ్చాయి. పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలు చేస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. కమర్షియల్​గ్యాస్​ధరలు పెరగడంతో దుకాణదారులు, హోటల్​ యజమానులపై భారం పడనుంది. ఫలితంగా మార్కెట్‌లో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నయంటే..

  • ముంబయిలో రూ.1725 ఉన్న గ్యాస్​ సిలిండర్​రూ.1732కు పెరిగింది
  • కోల్కతాలో గ్యాస్​ సిలిండర్ ధర రూ.1875.50 నుంచి రూ.1882.50 చేరింది
  • చెన్నైలో ధర రూ.1937 నుంచి రూ.1944కు పెరిగింది

ఇళ్లలో వినియోగించే గృహ వినియోగ గ్యాస్​సిలిండర్ల ధరల విషయానికొస్తే హైదరాబాద్​లో రూ.1155, ఢిల్లీలో రూ.1103, ముంబైలో రూ.1102.50, చెన్నైలో రూ.1118.50, బెంగళూరులో రూ.1105, శ్రీనగర్‌లో రూ.1219లుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.