AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతం పెరిగే అవకాశం.. వివరాలు ఇవి..

దాదాపు మూడు శాతం హెచ్ఆర్ఏను పెంచనున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో చివరిసారి హెచ్ఆర్ఏను ప్రభుత్వం పెంచింది. ఇదే గనుక నిజం అయితే ఉద్యోగులు భారీగా ప్రయోజనం పొందనున్నారు. ఇన్ హ్యాండ్ శాలరీ ఎక్కువగా వస్తుంది.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతం పెరిగే అవకాశం.. వివరాలు ఇవి..
7th Pay Commission
Madhu
|

Updated on: Jul 04, 2023 | 3:00 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో వారి జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది. అది కూడా టేక్ హోం శాలరీలో పెరుగుదలను వారు చూడనున్నారు. ఎందుకంటే హెచ్ఆర్ఏ(హౌస్ రెండ్ అలోవెన్స్) పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. దాదాపు మూడు శాతం హెచ్ఆర్ఏను పెంచనున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో చివరిసారి హెచ్ఆర్ఏను ప్రభుత్వం పెంచింది. ఇదే గనుక నిజం అయితే ఉద్యోగులు భారీగా ప్రయోజనం పొందనున్నారు. ఇన్ హ్యాండ్ శాలరీ ఎక్కువగా వస్తుంది. ఈ హెచ్ఆర్ఏ ఉద్యోగులు పనిచేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ఇది అసలు ఎందుకు ఇస్తారంటే ఉద్యోగులు అద్దె ఇళ్లలో ఉంటే వారి నివాసానికి అవసరమైన ఖర్చుల కోసం ఇస్తారు. దీనిని మూడు కేటగిరీలుగా విభాజించారు. ఎక్స్, వై, జెడ్. ఆయా కేటగిరీల్లో ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం..

ఎక్స్ కేటగిరీ.. దీనిలో జనాభా 50 లక్షలకన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వస్తాయి. ఏడో వేతర సంఘం(సీపీసీ) సిఫార్సుల ప్రకారం ఈ కేటగిరీలోని ఉద్యోగులకు 24శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది.

వై కేటగిరీ.. జనాభా 5 లక్షల నుంచి 50 లక్షల వరకూ ఉండే ప్రాంతాలు ఈ వై కేటగిరీలోకి వస్తాయి. సీపీసీ ప్రకారం వీరికి 16శాతం హెచ్ ఆర్ఏ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

జెడ్ కేటగిరీ.. జనాభా 5లక్షల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వారికి.. సీపీసీ ప్రకారం 8శాతం హెచ్ఆర్ఏ అందిస్తారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్స్ మెమోరండమ్ ప్రకారం హెచ్ఆర్ఏ రేట్లు ఉంటాయి. ఎక్స్, వై, జెడ్ కేటగిరీ సిటీల్లో 27శాతం, 18శాతం, 9శాతం హెచ్ఆర్ఏ ఇస్తారు. అయితే డియర్ నెస్ అలోవెన్స్(డీఏ) 50 శాతం దాటినప్పుడు హెచ్ఆర్ఏ 30 శాతం, 20 శాతం 10 శాతానికి సవరించబడతాయి.

జనవరిలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) నిబంధనలను నవీకరించింది. కొన్ని సందర్భాలలో వారు హెచ్ఆర్ఏకి అర్హులు కాదని పేర్కొంది. అవేంటో చూద్దాం..

  • అతను/ఆమె మరొక ప్రభుత్వ ఉద్యోగికి కేటాయించిన ప్రభుత్వ వసతిని పంచుకున్నప్పుడు హెచ్ఆర్ఏకి అర్హులు కారు.
  • అతను/ఆమె తన తల్లిదండ్రులు/కొడుకు/కూతురికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ అండర్‌టేకింగ్ లేదా మునిసిపాలిటీ, పోర్ట్ ట్రస్ట్, నేషనలైజ్డ్ బ్యాంక్‌లు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి సెమీ-ప్రభుత్వ సంస్థ ద్వారా కేటాయించిన వసతి గృహంలో నివసిస్తుంటే అటువంటి వారికి హెచ్ఆర్ఏ రాదు.
  • అతని/ఆమె జీవిత భాగస్వామికి అదే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ స్వయంప్రతిపత్తమైన పబ్లిక్ అండర్‌టేకింగ్/ మున్సిపాలిటీ, పోర్ట్ ట్రస్ట్ వంటి సెమీ-గవర్నమెంట్ సంస్థ వసతి కేటాయించినా.. అతను/ఆమె ఆ వసతిలో నివసించినా లేదా అతను/ఆమె అద్దెకు తీసుకున్న వసతి గృహంలో విడిగా నివసిస్తున్నా అర్హులు కారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..