Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Two Wheelers: భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కొనాలనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు..

కంపెనీలకు ఫేమ్ 2 సబ్సిడీ తగ్గించడంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరగడం అనివార్యం అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ హాప్ స్టార్టప్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది.

Electric Two Wheelers: భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కొనాలనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు..
Hop Oxo Electric Motor Cycle
Follow us
Madhu

|

Updated on: Jul 04, 2023 | 3:30 PM

మీరు ఎలక్ట్రిక్ బైక్ గానీ స్కూటర్ గానీ కొనాలకొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. జైపూర్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ హాప్ ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్లు లియో, లైఫ్ ధరలను ఒకేసారి తగ్గించింది. వాస్తవానికి ఫేమ్2 సబ్సిడీలను ప్రభుత్వం తగ్గించడంతో అంతా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అమాంతం పెరిగిపోతాయని భావిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలకు ఈ సబ్సీడి తగ్గించడంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరగడం అనివార్యం అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ హాప్ స్టార్టప్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు, బైక్ ధరను కూడా అందుబాటులో ఉంచింది.  ప్రస్తుతం హాప్ పోర్ట్ ఫోలియోలో మూడు ఈవీలు ఉన్నాయి. లైఫ్, లియో స్కూటర్లతో పాటు ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ధరల తగ్గింపు..

ఈ ఏడాది ప్రారంభంలో హై స్పీడ్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లియోను ఆవిష్కరించింది. ఇది కాక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైఫ్ ఉంది. వీటి ధరలు ఇప్పుడు తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన ధరలు ఇలా ఉన్నాయి.. లియో స్కూటర్ ధర రూ. 84,000గా ఉంది. అలాగే లైఫ్ స్కూటర్ ధర రూ. 67,500గా ఉంది. అదే విధంగా హాప్ కంపెనీ నుంచి వస్తున్న  ఓక్సో మోటార్ సైకిల్ ధర రూ. 1.65లక్షల నుంచి 1.48లక్షలకు తగ్గింది. ఇది నాలుగు రంగుల్లో లభ్యమవుతోంది. బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఓక్సో మోటార్ సైకిల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఓక్సో బైక్ స్పెసిఫికేషన్లు..

హాప్ స్టార్టప్ కు చెందిన ఈ ఓక్సో బైక్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. రైడర్ కి సౌకర్యంతో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ బైక్ స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే 3.75కిలోవాట్అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 5.2కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 200ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలగు సెకన్లలోనే అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 95 వేగంతో దూసుకెళ్తుంది. ఇటీవల ఈ బైక్ లో ఫోటా వీఈఆర్ 4.90 అప్ డేట్ వచ్చింది. దీని ఎకో మోడ్లో మరింత అధిక పనితీరును కనబరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..