AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విచిత్రం..! కిలోల కొద్దీ గంజాయి తినేసిన ఎలుకలు.. ఈజీగా శిక్ష తప్పించుకున్న నేరస్తులు

క్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను ఎలుకలు రక్షించిన ఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టైన్‌గా మారింది. రెండేళ్ల క్రితం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, గంజాయిని స్టోర్‌హౌస్‌లో..

విచిత్రం..! కిలోల కొద్దీ గంజాయి తినేసిన ఎలుకలు.. ఈజీగా శిక్ష తప్పించుకున్న నేరస్తులు
Rats
Srilakshmi C
|

Updated on: Jul 05, 2023 | 5:03 PM

Share

చెన్నై: అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను ఎలుకలు రక్షించిన ఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టైన్‌గా మారింది. రెండేళ్ల క్రితం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, గంజాయిని స్టోర్‌హౌస్‌లో దాచారు. ఐతే దాచిన 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆధారాలు మాయంకావడంతో ఇద్దరు నిందితులు మంగళవారం నిర్దోషులుగా సులువుగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని మెరినీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాజగోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు బీచ్‌ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తూ 2020లో పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం 22 కేజీల గంజాయిని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై విచారణ జరిపి ఛార్జిషీట్ దాఖలు చేశారు. వారి కేసును మంగళవారం స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్‌ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు సాక్షాధారాలు కోరింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిలో 50 గ్రాములను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపపారు.

మిగిలిన 21.9 కిలోల గంజాయిని చూపమని కోర్టుకోరగా దానిని ఎలుకలు తిన్నాయని పోలీసులు తెలిపారు. కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే కోర్టుకు సమర్పించారు. మరోచార్జిషీట్‌లో పేర్కొన్న గంజాయి మొత్తాన్ని పోలీసులు సమర్పించలేకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. దీంతో నిందితులు రాజగోపాల్, నాగేశ్వరరావులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ విషయం కాస్తా చర్చణీయాంశంగా మారింది.ఇప్పటికే పలు కేసుల్లో ఎలుకలు మద్యం తాగాయని, డ్రగ్స్‌ తినేశాయని చెప్పి ఎందరో నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే