Thankyou Doctor: మెడికల్ హబ్‌గా భారత్.. TV9 డిజిటల్ నేషనల్ డాక్టర్స్ డే కాంక్లేవ్‌లో ఆరోగ్య నిపుణులు..

TV9 - Thankyou Doctor:  జాతీయ వైద్యుల దినోత్సవం 2023 సందర్భంగా TV9 నెట్‌వర్క్‌ గ్రూప్ ఢిల్లీలో “నేషనల్ డాక్టర్స్ డే కాన్క్లేవ్” నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో విశేష కృషి చేసిన వైద్యులను సన్మానించారు.

Thankyou Doctor: మెడికల్ హబ్‌గా భారత్.. TV9 డిజిటల్ నేషనల్ డాక్టర్స్ డే కాంక్లేవ్‌లో ఆరోగ్య నిపుణులు..
TV9 Digital National Doctors' Day Conclave 2023
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2023 | 3:56 PM

TV9 Digital National Doctors’ Day Conclave 2023: జాతీయ వైద్యుల దినోత్సవం 2023 సందర్భంగా TV9 నెట్‌వర్క్‌ గ్రూప్ ఢిల్లీలో “నేషనల్ డాక్టర్స్ డే కాన్క్లేవ్” నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో విశేష కృషి చేసిన వైద్యులను సన్మానించారు. ఈ సదస్సులో వైద్యులు, ఫార్మా నిపుణులతో పలు సమావేశాలు, చర్చలు నిర్వహించారు. ఇందులో వారి జీవితానుభవం, ఆరోగ్య రంగంలో నూతన సాంకేతికత, ఆరోగ్య రంగంలో సవాళ్లు సహా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరిచారు. టెక్నాలజీ, హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం ఇప్పుడు చాలా పురోగమిస్తోందంటూ వైద్యులందరూ ముక్తకంఠంతో చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.

TV9 నిర్వహించిన ఈ హెల్త్ కాన్క్లేవ్ మొదటి సెషన్ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో ప్రసంగంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన కోవిడ్ కాలంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. కరోనా వచ్చినప్పుడు ఆసుపత్రుల్లో టెస్టింగ్ కిట్లు, పడకల కొరత ఏర్పడిందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అప్పుడు ఆక్సిజన్ సరఫరా సమస్య కూడా ఏర్పడిందని వివరించారు.

‘‘కోవిడ్ తర్వాత ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను చాలా పెంచింది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు 12,400 పడకలు ఉన్నాయి. వాటి సంఖ్య 2024 నాటికి రెట్టింపు అవుతుంది. ఢిల్లీలో దేశంలోనే అతిపెద్ద ట్రామా సెంటర్ కూడా 2024 నాటికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’’ అంటూ సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి
Thankyou Doctor1

TV9 Digital National Doctors’ Day Conclave 2023

మంచి ఆరోగ్యం కోసం.. మంచి జీవనశైలి

హెల్త్ కాన్‌క్లేవ్ రెండవ సెషన్‌లో మెదాంతా హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ అర్విందర్ సింగ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాలేయం ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ సింగ్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ దినచర్యను సరిదిద్దుకోవాలన్నారు. కాలేయం ఫిట్‌గా ఉంటే శరీరంలో అనేక రోగాల ముప్పు తగ్గుతుందని తెలిపారు.

అపోలో హాస్పిటల్‌లోని సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ యష్ గులాటి కూడా తన అభిప్రాయాలను వివరించారు. ప్రయివేటు ఆసుపత్రుల మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. దీని కోసం అన్ని స్థాయిలలో పని జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలను పెంచడం వల్ల నగరాల్లో ఆసుపత్రుల్లో రోగుల భారం తగ్గుతాయని.. ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు.

భారతదేశం మెడికల్ కేంద్రంగా మారింది..

జాతీయ వైద్యుల దినోత్సవం కాన్క్లేవ్ మూడవ సెషన్‌లో ఆరోగ్య రంగంలో సవాళ్లు – కొత్త అవకాశాలపై చర్చించారు. ఆరోగ్య రంగంలో సవాళ్లపై వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు, రోగుల మధ్య నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. దీనితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాల గురించి ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. భారతదేశం మెడికల్ టూరిజం కేంద్రంగా మారిందని అన్నారు. దేశం 100 కంటే ఎక్కువ దేశాలకు HIV ఔషధాన్ని, 170 కంటే ఎక్కువ దేశాలకు వివిధ వ్యాధులకు వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తుంది. అనేక దేశాల నుండి రోగులు చికిత్స కోసం భారతదేశానికి వస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఆరోగ్య సేవలు ఎక్కువ అని తెలిపారు.

Thankyou Doctor3

TV9 Digital National Doctors’ Day Conclave 2023

కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం..

ఈ కార్యక్రమం నాల్గవ సెషన్‌లో “కొత్త ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?” అనే అంశంపై చర్చ నిర్వహించారు.

ఈ సెషన్‌లో, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (IM) డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో దేశంలోని 2 వేల మంది వైద్యులు రోగులకు సేవ చేస్తూ తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. వైద్యుల వల్లే దేశం ఇంత పెద్ద మహమ్మారిని ఎదుర్కోగలిగింది. కోవిడ్ సమయంలో వైద్యులు పగలు, రాత్రి రోగులకు సేవలందించారు. ఈ సమయంలో వేలాది మంది వైద్యులు కూడా వ్యాధి బారిన పడ్డారు. అయినా పట్టించుకోకుండా రోగులకు చికిత్స అందించారని వివరించారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు అనేక రెట్లు పెరిగాయని డాక్టర్ శరద్ అన్నారు. కొత్త అంటువ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాంటి మరే ఇతర మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

డిజిఎఫ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శారదా జైన్ మాట్లాడుతూ.. కరోనా కాలం చాలా సవాలుగా మారిందని.. కోవిడ్ సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది శ్రద్ధగా, కష్టపడి పనిచేశారన్నారు. ఆ సమయంలో వైద్యులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు తమ విధులను కొనసాగిస్తూనే ఉన్నారు. కోవిడ్‌లో లక్షలాది మంది రోగులకు వైద్యులు చికిత్స అందించారన్నారు. కోవిడ్ మహమ్మారిని భారతదేశం ఎదుర్కొన్న తీరును ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. కోవిడ్ తర్వాత, ఇప్పుడు ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా పెరిగాయి. ఇప్పుడు ఏదైనా కొత్త మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.

Thankyou Doctor2

TV9 Digital National Doctors’ Day Conclave 2023

రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం..

హెల్త్ కాన్క్లేవ్ యొక్క ఐదవ సెషన్‌లో “వండర్ వుమన్ – మేనేజింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్” అనే అంశం చర్చ నిర్వహించారు. ఇందులో డాక్టర్ సుశీల (గైనకాలజిస్ట్), డాక్టర్ రష్మీ గుప్తా, డాక్టర్ ఇలా గుప్తా (క్లౌడ్ 9 హాస్పిటల్) డాక్టర్ శ్వేతా గార్గ్ పాల్గొన్నారు. ఇందులో మహిళల జీవితంలో ఉద్యోగం, కుటుంబం మధ్య సమతూకం ఎలా ఉండాలనే అంశంపై మాట్లాడారు.

ఫెలిక్స్ హాస్పిటల్ డైరెక్టర్, పీడియాట్రిషియన్ డాక్టర్ రష్మీ గుప్తా మాట్లాడుతూ.. కొన్నిసార్లు వైద్యులు తమ కుటుంబం కంటే రోగికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే, అతనికి చికిత్స అందించడం వైద్యుల బాధ్యత అని పేర్కొన్నారు. డాక్టర్ వృత్తిని ఎంచుకున్నాడు కాబట్టి, దానిని నెరవేర్చడం కూడా అతని బాధ్యత. చాలా సందర్భాలలో అతను తన బిడ్డకు ఏదైనా సమస్య ఉన్న కూడా ఆసుపత్రిలో చికిత్స చేయడం జరిగుతుంటుందని పేర్కొన్నారు. డాక్టర్ రష్మీ మాట్లాడుతూ వైద్యులకు పని-జీవిత సమతుల్యత అవసరమని, అయితే వైద్యుడిగా రోగులకు సేవ చేయడమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు.

ఆరోగ్య రంగంలో డిజిటలైజేషన్..

ఈ ఆరవ సెషన్‌లో, దేశంలో మారుతున్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు – డిజిటలైజేషన్ గురించి చర్చించారు.

AGATSA వ్యవస్థాపకుడు రాహుల్ రస్తోగి, AGATSA డైరెక్టర్ నేహా రస్తోగి, అమెరి హెల్త్ హోమ్ హెల్త్ కేర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్, కన్సల్టెంట్ డాక్టర్ చారు దత్ అరోరా సెషన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆరోగ్యాన్ని డిజిటలైజేషన్ చేయడం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతోందని రాహుల్ రస్తోగి అన్నారు. ఆరోగ్యం డిజిటలైజేషన్‌తో, రోగుల రికార్డులను నిర్వహించడం చాలా సులభమన్నారు.

ఈ సెషన్‌లో డాక్టర్ చారు అరోరా మాట్లాడుతూ.. డిజిటలైజేషన్ తర్వాత ఆరోగ్య రంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఇప్పుడు ఆహారంలాగే మందులు కూడా డోర్ స్టెప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యం డిజిటలైజేషన్ వల్ల రోగుల సమయం కూడా చాలా ఆదా అవుతోందన్నారు.

ఇప్పుడు రోగి తన బిపి, హృదయ స్పందన రేటును సులభంగా లెక్కించవచ్చు. వీరి రిపోర్టు ఆన్‌లైన్‌లో డాక్టర్‌కి చేరుతుంది. ఇప్పుడు పాలియేటివ్ కేర్ సౌకర్యం ఇంట్లో కూడా అందుబాటులో ఉంటుంది. డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సుతో పోస్ట్ స్ట్రోక్ గురించి తెలుస్తోంది. ఇప్పుడు రోగి తన ఆరోగ్య సమాచారాన్ని ఇంటర్నెట్ సహాయంతో వైద్యులకు పంపవచ్చు. భవిష్యత్తులో, సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా AI సహాయంతో సులభంగా చేయవచ్చు.

సమాజంలో వైద్యుల గొప్ప సహకారం..

హెల్త్ కాన్క్లేవ్ ఏడవ సెషన్‌లో ఫెలిక్స్ హాస్పిటల్ MD డాక్టర్ DK గుప్తా ప్రసంగించారు . డాక్టర్ గుప్తా మాట్లాడుతూ వైద్యులు సమాజానికి పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో జీడీపీ గణనీయంగా పెరిగింది. అయితే ప్రస్తుతం ఆరోగ్య రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నంతగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరత కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో, దానిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. PPP మోడల్ ఆరోగ్య రంగంలో GDPని పెంచడం ద్వారా దీనిని మెరుగుపరచవచ్చు.

అనేక రెట్లు పెరిగిన వైద్య కళాశాలలు..

కార్యక్రమం ఎనిమిదవ సెషన్‌లో, “ఆరోగ్య విద్యలో తదుపరి సరిహద్దు” అనే అంశంపై చర్చించారు. ఇందులో లోక్ నాయక్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి, డెంటల్ సర్జన్ డాక్టర్ అనిల్ కోహ్లీ పాల్గొన్నారు. నిపుణులందరూ వైద్య విద్యకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడారు.

డాక్టర్ సుభాష్ మాట్లాడుతూ విదేశాల్లో కంటే భారతదేశంలోనే వైద్యవిద్యలో పోటీ ఎక్కువగా ఉందన్నారు. విదేశాల్లోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడం సులభం. అయితే భారతదేశంలో, పరీక్షలో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన తర్వాత మాత్రమే మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. డాక్టర్ సుభాష్ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెండు రెట్లు పెరిగిందన్నారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పిల్లలు ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నారు.

Thankyou Doctor4

TV9 Digital National Doctors’ Day Conclave 2023

క్యాన్సర్ చికిత్సలో..

హెల్త్ కాన్‌క్లేవ్ చివరి సెషన్‌లో క్యాన్సర్ రోగుల చికిత్స-సంరక్షణ గురించి చర్చించారు. ఈ సెషన్‌లో TATA 1mg/ (డయాగ్నోస్టిక్) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రశాంత్ నాగ్, క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రజిత్ చనానా, డాక్టర్ సమీర్ భాటి, డాక్టర్ అనిల్ థాక్వానీ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా డా.ప్రశాంత్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ వంటి వ్యాధులకు సంబంధించి ఇంకా చాలా వరకు సమాచారం అందడం లేదని, అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్‌ నిర్ధారణ గతంలో కంటే సులభమవుతోందన్నారు. కానీ కొత్త టెక్నాలజీతో వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Associate sponsor: Agatsa, Felix Hospital, TATA 1mg/Labs