ఇకనుంచి జాతీయ రహదారులపైకి పశువులు రాకుండా చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర రవాణాశాఖ

సాధారణంగా రహదారులపైకి పశువులు రావడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల్లో అయితే ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రాణాలు కూడా కోల్పుతున్న పరిస్థితి ఏర్పడింది. గేదెలు, ఆవులు, మేకలు లాంటి మూగజీవులు అకస్మాత్తుగా రోడ్లపైకి వస్తుంటాయి.

ఇకనుంచి జాతీయ రహదారులపైకి పశువులు రాకుండా చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర రవాణాశాఖ
Fencing
Follow us
Aravind B

|

Updated on: Jul 06, 2023 | 11:31 AM

సాధారణంగా రహదారులపైకి పశువులు రావడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల్లో అయితే ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రాణాలు కూడా కోల్పుతున్న పరిస్థితి ఏర్పడింది. గేదెలు, ఆవులు, మేకలు లాంటి మూగజీవులు అకస్మాత్తుగా రోడ్లపైకి వస్తుంటాయి. అయితే చాలా ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపుల సరైన కంచెలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు అరికట్టేందుకు కేంద్ర రహదారి, రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలలో ప్రమాదాలకు కారణమవుతున్న పశువులను అడ్డుకునేందుకు రోడ్లకు రెండువైపులా వెదురుతో కూడిన బాహుబలి కంచెను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

పశువులు రోడ్ల పైకి రావడం వల్ల జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు భారీ కంచెను ఏర్పాచు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దాదాపు 1.20 మీటర్ల వరకు ఎత్తు ఉండే ఈ కంచెను తాజాగా జాతీయ రహదారి-30లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ వెదురు కంచె ఏర్పాటు చేయడం వల్ల పర్యవరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. పశువుల వల్ల కలిగే ప్రమాదాలను కనీస స్థాయికి తీసుకొచ్చేందుకు ఈ కంచె ఏర్పాటు ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..