Tomato Price: కొనేదెట్టా.. తినేదెట్టా..! తగ్గేదేలే అంటున్న టామాటా ధరలు.. మార్కెట్‌లో రేటు ఎంత ఉందంటే..
Tomato market price: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ చూసినా ధరల్లో తగ్గేదేలే అంటున్నాయి. దీంతో సామాన్యులు కొనేదెట్టా.. తినేదెట్టా అంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Updated on: Jul 06, 2023 | 9:10 AM

Tomato market price: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ చూసినా ధరల్లో తగ్గేదేలే అంటున్నాయి. దీంతో సామాన్యులు కొనేదెట్టా.. తినేదెట్టా అంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక, టామాటా గురించి అయితే.. మాట్లాడే పనే లేదు.. గతంలో ఎన్నడూ లేని విధంగా టామాటా ధరలు భారీగా పెరిగాయి.

ముఖ్యంగా టామాట దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో టామాటకు డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశన్నంటుతున్నాయని పేర్కొంటున్నారు వ్యాపారులు.

ప్రస్తుతం టమాటా ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కిలో టమాటా ధర రూ.150లకు పైగా పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే, 180 వరకు అమ్ముడవుతోంది.


టమాట రేటు రోజురోజుకు పెరుగుతుండటంతో.. ఈ కూరగా సామాన్యుడి ఇంట కనిపించకుండా పోయింది.. టమాటాలకు పోటీగా.. మిర్చి ధరలు కూడా పెరిగాయని.. కిలో 120కి పైగా పలుకుతున్నట్లు పేర్కొంటున్నారు.
