Indian Railways: గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ ముఖ్యసూచనలు జారీ చేసింది. భద్రతా పరమైన పనుల కారణంగా గత కొన్ని రోజులుగా పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యం రైళ్లరాకపోకలు గంటల తరబడి..

Indian Railways: గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
Indian Railways
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2023 | 9:05 AM

విశాఖపట్నం: రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ ముఖ్యసూచనలు జారీ చేసింది. భద్రతా పరమైన పనుల కారణంగా గత కొన్ని రోజులుగా పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యం రైళ్లరాకపోకలు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 7) కొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు తెలియజేస్తూ వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి రీషెడ్యూల్‌ విడుదల చేశారు. అయినప్పటికీ రైళ్లు మరింత ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఏయే ట్రైన్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయంటే..

  • బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-షాలిమార్‌ రాత్రి 8.25 గంటలకు బయలుదేరేలా మార్పులు చేసి పంపించారు.
  • షాలిమార్‌-చెన్నై (12841) కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మధ్యాహ్నం 3.20 గంటలకు షాలిమార్‌లో బయలుదేరాల్సి ఉండగా అది సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరింది.
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849).. మధ్యాహ్నం12.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరింది.
  • సత్యసాయి ప్రశాంతి నిలయం (22831) ఎక్స్‌ప్రెస్‌.. ఉదయం 4.50 గంటలకు హావ్‌డాలో బయలుదేరాల్సి ఉండగా అది ఆలస్యంగా సాయంత్రం 6.30 గంటలకు
  • భువనేశ్వర్‌(18464) ఎక్స్‌ప్రెస్‌ .. బెంగళూర్‌లో ఉదయం 1.40 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాయంత్రం 5.35 గంటలకు
  • డిబ్రూఘర్‌ (22503) ఎక్స్‌ప్రెస్‌.. కన్యాకుమారిలో సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ రాత్రి 8.30 గంటలకు
  • విశాఖ (20812) ఎక్స్‌ప్రెస్‌.. నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ సాయంత్రం 6.30 గంటలకు ఆలస్యంగా బయల్దేరింది. ఇలా ఏకంగా మూడు నుంచి 6 గంటల వరకు రైళ్లు ఆలస్యం నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

డిసెంబరు 20 నుంచి పీజీ మెడికల్‌ తరగతులు ప్రారంభం
డిసెంబరు 20 నుంచి పీజీ మెడికల్‌ తరగతులు ప్రారంభం
ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ మెలోడి
ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ మెలోడి
బచ్చల మల్లి టీజర్ రివ్యూ.. అల్లరోడిలో మరో యాంగిల్..!
బచ్చల మల్లి టీజర్ రివ్యూ.. అల్లరోడిలో మరో యాంగిల్..!
నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌
నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌
దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!
దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!
గుండెపోటుతో నాలుగో తరగతి బాలిక మృతి.. 2 వారాల వ్యవధిలో మరో దారుణం
గుండెపోటుతో నాలుగో తరగతి బాలిక మృతి.. 2 వారాల వ్యవధిలో మరో దారుణం
నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. తిరుమలతో విచారణ వేగవంతం
నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. తిరుమలతో విచారణ వేగవంతం
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే
నేడు రేపు ఏపీలో వానలే వానలు.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
నేడు రేపు ఏపీలో వానలే వానలు.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
మిక్స్‌డ్ రియాలిటీ ప్రింట్ యాడ్‌తో జీఆర్‌టీ జువెలర్స్ కొత్త షోరూం
మిక్స్‌డ్ రియాలిటీ ప్రింట్ యాడ్‌తో జీఆర్‌టీ జువెలర్స్ కొత్త షోరూం