AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూమారం రేపుతున్న ఆదివాసిపై మూత్ర విసర్జన ఘటన.. నిందితుడి ఇళ్లు కూల్చివేత..

మధ్యప్రదేశ్ ఓ ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఇప్పటికి వరకు ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులు, రౌడీషీటర్ల ఇళ్లను బల్డోజర్లతో కల్చివేసే కల్చర్ ఉండేది.

దూమారం రేపుతున్న ఆదివాసిపై మూత్ర విసర్జన  ఘటన.. నిందితుడి ఇళ్లు కూల్చివేత..
Bulldozer
Aravind B
|

Updated on: Jul 06, 2023 | 9:54 AM

Share

మధ్యప్రదేశ్ ఓ ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఇప్పటికి వరకు ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులు, రౌడీషీటర్ల ఇళ్లను బల్డోజర్లతో కల్చివేసే కల్చర్ ఉండేది. ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్‌లోకి కూడా వచ్చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిధీ జిల్లాలో ఓ యువకుడి ముఖంపై పై ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ తర్వాత రాజకీయ వివాదం కూడా రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు.. నిందితుడు ప్రవేశ్ శుక్లాకు బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించారు. అయితే దీన్ని బీజేపీ ఖండించింది. చివరికి పోలీసులు నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరోవైపు ఈ అమానుష ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బీజేపీ విద్వేష సంస్కృతికి అద్దం పడుతున్నాయని ఆరోపించారు. ఆదివాసీలపై జరుగుతున్న ఇలాంటి దాడులు సిగ్గుచేటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అలాగే ఇటువంటి అసహ్యకరమైన చర్యలకు పాల్పడటం దారుణమంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..