Monsoon: దక్షిణ భారతదేశంలో 123 ఏళ్లలో అతి తక్కువ వర్షపాతం నమోదు.. కారణం ఏమిటో తెలుసా?
ఈ ఏడాది జూన్ నెలలో దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది గత 123 ఏళ్లలో తక్కువ వర్షపాతం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 1976లో 90.7 మి.మీ వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్‌లో దక్షిణ భారతదేశంలో కేవలం 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వాస్తవానికి భారత దేశంలో రుతుపవనాలు దక్షిణ భారతదేశంలో ముందుగా అడుగు పెడతాయి. కేరళ నుంచి మొదలవుతాయి. అయితే ఈసారి రుతుపవనాలు దక్షిణ భారత దేశాన్ని చాలా నిరాశపరిచాయి. ఈ ఏడాది జూన్ నెలలో దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది గత 123 ఏళ్లలో తక్కువ వర్షపాతం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 1976లో 90.7 మి.మీ వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్‌లో దక్షిణ భారతదేశంలో కేవలం 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారత వాతావరణ శాఖ జూన్ నెల వాతావరణ శాఖ మంగళవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. IMD ప్రకారం, దక్షిణ భారత దేశంలో 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే వాయువ్య భారతదేశంలో 42 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
దేశం మొత్తం మీద 10 శాతం తక్కువ వర్షం IMD ప్రకారం దేశం మొత్తం జూన్ నెలలో కురిసే వర్షం సగటు కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో దక్షిణ భారత దేశంలో సాధారణ వర్షపాతం 161 మిల్లీమీటర్ల వరకు నమోదైంది. అయితే ఈ సంవత్సరం 88.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సంఖ్య సాధారణం కంటే 45 శాతం తక్కువ. దక్షిణ భారతదేశంతో పాటు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో కూడా 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో ఇక్కడ 269.9 మి.మీ వర్షపాతం నమోదైంది.




వాయువ్య భారతంలో భారీ వర్షాలు జూన్ నెలలో వాయువ్య భారతదేశంలో వర్షాలు 42 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. వాయువ్య భారతదేశంలో జూన్‌లో సాధారణ వర్షపాతం సంఖ్య 78.1 మిమీ అయితే, ఈ సంవత్సరం జూన్ నెలలో, ఇక్కడ రికార్డు స్థాయిలో 111.2 మిమీ వర్షపాతం నమోదైంది. దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో కురిసిన వర్షాలు.. జూన్ నెలలో వర్షపాతం అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. ఒడిశా, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి.
బిపార్జోయ్ రుతుపవనాలపై ఎలా ప్రభావం చూపిస్తుందంటే.. ఈ ఏడాది జూన్‌లో అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను ‘బిపార్జోయ్’ ఏర్పడింది. జూన్ 6 నుంచి జూన్ 19 వరకు అరేబియా సముద్రంలో ఉండిపోయింది. దీని కారణంగా జూన్ 9 నుంచి 11 వరకు, జూన్ 25 నుంచి 30 వరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. రుతుపవనాల సమయంలో, ఈ అల్పపీడనాల వలన దేశంలోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాలు కురిశాయి.
జూన్‌లో వర్షంతో పాటు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత జూన్ 2023లో వర్షంతో పాటు, ఉష్ణోగ్రత కూడా రికార్డులను సృష్టించింది. ఈ సంవత్సరం జూన్‌లో 1901 నుండి మూడవ అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 26.04 డిగ్రీల సెల్సియస్. అంతకుముందు 2014 సంవత్సరంలో 26.23°C, 1926వ సంవత్సరంలో 26.11°C నమోదైంది. ఈ సమయంలో భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో అత్యధిక వేడి నమోదైంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో జూన్‌లో 11 నుండి 19 రోజుల పాటు వేడిగాలులు కొనసాగాయి.
వీటిలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ఉన్నాయి. దేశంలోని తూర్పు ప్రాంతాలతో పాటు ఈశాన్య ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాలతో పాటు, దక్షిణ భారత దేశం, వాయువ్య ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..