AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: కొడుకును ట్రెన్ ఎక్కించి ఇంటి వచ్చి చూడగా మైండ్ బ్లాంక్..

ఆ వ్యాపారి ఊరికి వెళ్తున్నాడని ముందుగానే సమాచారం తెలుసుకున్నట్లు ఉన్నారు. పక్కాగా స్కెచ్ వేసి ఇంటికి కన్నం వేశారు. కేజీల కొద్దీ వెండి, బంగారం దోచుకెళ్లిపోయారు.

Guntur: కొడుకును ట్రెన్ ఎక్కించి ఇంటి వచ్చి చూడగా మైండ్ బ్లాంక్..
Theft
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 9:41 AM

Share

గుంటూరులోని కొత్తపేటకు చెందిన నరసింహారావు పండ్ల మార్కెట్ లో కమీషన్ వ్యాపారిగా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతని కొడుకు అమెరికా నుండి వచ్చి వైజాగ్ వెళ్ళేందుకు సిద్దమయ్యాడు. దీంతో అతన్ని వందేభారత్ ట్రెన్ ఎక్కించేందుకు విజయవాడ వెళ్ళారు. కుటుంబ సభ్యులంతా విజయవాడ వెళ్ళారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగ రాత్రి ఏడు గంటల సమయంలో కొత్తపేటలోని నరసింహారావు ఇంటికి వెళ్ళాడు. నరసింహారావు మొదటి అంతస్థులో ఉంటాడు. ఇంటికి వెళ్ళిన దొంగ తాళం తొలగించి లోపలికి వెళ్ళాడు. అనుమానం రాకుండా కర్టెన్ వేశాడు. ఇంటి లోపల ఉన్న బీరువాలు పగులకొట్టాడు.

మూడు కేజీల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు తీసుకొని కిందకు వచ్చాడు. అదే సమయంలో కింద ఉన్న వాళ్ళు ఎవరని ప్రశ్నించగా పై ఇంటికొచ్చామని చెప్పుకుంటూ వెళ్ళి పోయాడు. విజయవాడ నుండి తిరిగి వచ్చిన నరసింహారావు కుటుంబం తలుపు తీసి ఉండటంతో హడావుడిగా లోపలికి వెళ్ళారు. అప్పటికే దొంగలు పడినట్లు అర్థమైంది. పోలీసులుకు సమాచారం ఇచ్చారు.

అంత విలువైన ఆభరణాలు ఇంటిలో ఎందుకు పెట్టుకున్నారని నరసింహారావు కుటుంబాన్ని ప్రశ్నించగా బ్యాంక్ లాకర్ కేటాయించడంలో జాప్యం జరిగిందని అందుకే ఇంటిలో ఉంచామని చెప్పారు. దీంతో తెలిసిన వాళ్ళే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!