Arjun Modhwadia: మోదీ నిజమైన ప్రజాస్వామ్యవాది.. కితాబు ఇచ్చిన గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోద్వాడియా

దేశ విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఇదొక్కటే కాదు, ఆయన మద్దతుదారులతో పాటు ఆయన వ్యతిరేక పార్టీల ప్రజలు కూడా కొన్ని విషయాల్లో మోదీని పొగడడానికి వెనుకాడరు. ప్రధాని నరేంద్ర మోదీపై గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు.

Arjun Modhwadia: మోదీ నిజమైన ప్రజాస్వామ్యవాది.. కితాబు ఇచ్చిన గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోద్వాడియా
Arjun Modhwadia On Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 30, 2024 | 12:22 PM

ఎక్కడ ఎప్పుడు ఎలా నొక్కాలో అక్కడ అప్పుడు అలా నొక్కడమే రాజకీయం. ఓటు ఉన్నోడి మనసును కొల్లగొట్టడం అనేది ఓ కళ అయితే, ప్రతిపక్షాల నేతల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీది. ప్రతి అంశంలోనూ మోదీ చూపిస్తున్న దూకుడు దేశ విదేశాల్లోనూ మెప్పు పొందుతున్నారు. ఈసారి లోక్‌సభలో అత్యధిక స్థానాలు సంపాదించడంతోపాటు, కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టడం కాదు.. ఆ కొట్టే హ్యాట్రిక్‌లో కూడా కిక్కుండాల అనేది మోదీ తాజా మేనరిజం. ఈసారి టార్గెట్‌ని 400 దగ్గర ఫిక్స్ చేసుకున్నప్పుడే మోదీ మార్క్ ఆఫ్ దండయాత్ర షురూ ఐంది.

దేశ విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఇదొక్కటే కాదు, ఆయన మద్దతుదారులతో పాటు ఆయన వ్యతిరేక పార్టీల ప్రజలు కూడా కొన్ని విషయాల్లో మోదీని పొగడడానికి వెనుకాడరు. ప్రధాని నరేంద్ర మోదీపై గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వానికి సంబంధించిన మొదటి అంశాలలో ఆయన నిజమైన లోక్ తాంత్రికుడిగా పేర్కొన్నారు.

గుజరాత్ మాజీ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అర్జున్ మోద్వాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నరేంద్ర మోదీ నిజమైన ప్రజాస్వామ్యవాది అంటూ కితాబు ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని ఒక అంశం ఏంటీ, ప్రతి విషయంలో ఆయనకు సాటి లేదన్నారు. ఆయన అందరి అభిప్రాయాలకు విలువనివ్వడమే కాకుండా వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆయన తెలిపారు. మోదీ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారన్నారు. ప్రతిపక్షాల మాటకు విలువనిస్తూ, సలహాలు, సూచనలు సైతం పాటిస్తారని అర్జున్ మోద్వాడియా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోద్వాడియా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. వీడియో చూడండి..

ఇదిలావుంటే, దేశమంతా నమో నమామి అంటోంది. చాలా సర్వేలు భారతీయ జనతా పార్టీదే విజయం అంటున్నాయి. ఔర్‌ ఏక్‌ ధక్కా…హ్యాట్రిక్‌ పక్కా అంటున్నాయి బీజేపీ వర్గాలు. అబ్‌ కీ బార్‌…చార్‌ సౌ పార్‌ అంటోంది కాషాయ కూటమి. అయితే 400 సీట్లు దాటాలంటే మామూలు పొలిటికల్ ఫీట్లు సరిపోవు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ గెలుపును భుజస్కందాలపై మోస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మండేఎండను సైతం లెక్కచేయకుండా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. రోజుకు 3వేల 500 కి.మీ పర్యటించి 4 ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏఫ్రిల్ 30 ఇవాళ తెలంగాణలోని మెదక్, సిద్దిపేట జిల్లాలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…