Saint: వందలాది కోట్లు దానం చేసి సన్యాసం స్వీకరించిన సంపన్న కుటుంబం.. వివరాలివే..
మీ వద్ద కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, ఆ మొత్తాన్ని దానం చేయమని కోరితే చేస్తారా? చచ్చినా చెయ్యరు. కుదిరిస్తే కాస్తా కూస్తో చేస్తారు తప్ప.. ఆస్తినంతటినీ దానం అంటే చల్ హట్ అంటారు.
మీ వద్ద కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, ఆ మొత్తాన్ని దానం చేయమని కోరితే చేస్తారా? చచ్చినా చెయ్యరు. కుదిరిస్తే కాస్తా కూస్తో చేస్తారు తప్ప.. ఆస్తినంతటినీ దానం అంటే చల్ హట్ అంటారు. వ్యక్తి తాను నడుస్తున్న దారిలో వంద రూపాయల నోటు దొరికితేనే గుట్టు చప్పుడు కాకుండా జేబులో పెట్టుకునే రోజులు ఇవి. అలాంటి ఓ కుటుంబం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందలాది కోట్లు దానం చేసి, సన్యాసం స్వీకరించింది. దైవ సేవ కోసం ఇంతకాలం తాము కష్టపడి సంపాదించిన సొమ్మునంతా విరాళంగా ఇచ్చేసింది ఆ కుటుంబం. ఎవరు వీరు? ఎందుకిలా చేశారు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్‌లోని భుజ్ కు చెందిన ఓ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబం మొత్తం సన్యాసం స్వీకరించింది. ఇంతకాలంలో తాము సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిని దానం చేస్తున్నట్లు ప్రకటించింది ఆ కుటుంబం. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఆకుటుంబం. కుటుంబంలోని నలుగురూ కలిసి దీక్ష చేపట్టినట్లు, దీక్ష నియమనిబంధనల ప్రకారం తమ సంపదనంతా దానం చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది.
భుజ్‌కు చెందిన పూర్వీ బెన్ మెహతా కుటుంబం జైనా మతానికి చెందినవారు. వీరి కుటుంబ సభ్యులంతా భగవతి దీక్షను స్వీకరించారు. మిలియనీర్ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన వీరు.. దుస్తుల బిజినెస్‌లో గట్టిగానే సంపాదించారు. వీరి టర్నోవర్ ఏడాది కోటి రూపాయలు పైగానే ఉంటుంది. భార్య భర్తలు పూర్వీ బెన్ మెహతా, పీయూష్ మెహతా, కుమారుడు మేఘ్ కుమార్, మేనల్లుడు క్రిష్ భగవతి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మహావ్రతాలు, బ్రహ్మచర్యం, ఆచార్య, పాదయాత్ర వంటివి ఉంటాయి.
వార్సిక ఆదాయం రూ. 1 కోటి..
ఈ దీక్షను స్వీకరించిన వారు.. జీవితాంతం విద్యుత్ వినియోగానికి దూరంగా ఉండాలి. డబ్బు లేకుండా జీవించాలి. దీంతోపాటు జీవితాంతం కూడబెట్టిన మూల ధనాన్ని విరాళంగా ఇవ్వాలి. దీని ప్రకారం.. పీయూష్ తన సంపాదనను అంతా దానం చేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..