IT Raids BBC: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. తీవ్రంగా స్పందించిన విపక్షాలు.. సమర్థించుకున్న కేంద్రం..

బీబీసీ ఆఫీసుల్లో వరుసగా ఐటీ సర్వేలు సంచలనం రేపుతున్నాయి. బీబీసీ ఇండియా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు ఐటీ అధికారులు.

IT Raids BBC: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. తీవ్రంగా స్పందించిన విపక్షాలు.. సమర్థించుకున్న కేంద్రం..
Bbc It Raids
Follow us

|

Updated on: Feb 15, 2023 | 11:07 PM

బీబీసీ ఆఫీసుల్లో వరుసగా ఐటీ సర్వేలు సంచలనం రేపుతున్నాయి. బీబీసీ ఇండియా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు ఐటీ అధికారులు. అటు.. బీబీసీ ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు హిందూసేన కార్యకర్తలు. మరోవైపు.. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు బీజేపీ -కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్దానికి తెరతీశాయి.

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. భారత్‌లో పత్రికా స్వేచ్చకు ముప్పు మాత్రమే కాదు.. దేశంలో మీడియా లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. బీబీసీ సంస్థకు లాభ నష్టాలతో సంబంధం లేదని, ప్రజలు ఇచ్చే విరాళాలతో ఆ సంస్థ నడస్తుందని.. అలాంటప్పుడు పన్ను ఎగవేత ఎలా సాధ్యమని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. గతంలో బీబీసీ ని పొగిడిన ప్రధాని మోదీ.. వ్యతిరేకంగా వార్తలు రాగానే ఎందుకు మారిపోయారని కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా ప్రశ్నించారు. అయితే, బీబీసీ పై ఐటీ సోదాలను కేంద్రం పూర్తిగా సమర్ధించింది. దీనిపై ఐటీ శాఖ పూర్తి వివరాలను వెల్లడిస్తుందని ప్రకటించింది.

బీబీసీ కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. భారత ప్రతిష్టను దిగజార్చేవిధంగా.. ప్రధాని మోదీపై కుట్రపూరితంగా వార్తలు ప్రసారం చేస్తోందని హిందూసేన ఆరోపించింది. ఢిల్లీ లోని బీబీసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు హిందూసేన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీబీసీ ని బ్యాన్‌ చేయాలని హిందూసేన కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. బీబీసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన హిందూసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ కార్యాలయం ముందు భద్రతను పెంపు..

హిందూసేన కార్యకర్తల ఆందోళన తరువాత ఢిల్లీ లోని బీబీసీ కార్యాలయం ముందు భద్రతను పెంచారు. ITBP కమెండోలతో BBC కార్యాలయం ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పన్ను ఎగవేత ఆరోపణలపై రెండు రోజుల పాటు గా బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. చాలామంది సిబ్బంది ఆఫీస్‌కు రావద్దని, ఇంటి నుంచి పనిచేయాలని BBC సంస్థ కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..