Gold Price Today: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. భాగ్య నగరంలో తగ్గిన బంగారం ధర. తులంపై ఎంతంటే..
ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరకు బ్రేక్‌లు పడుతున్నాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో..
ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరకు బ్రేక్‌లు పడుతున్నాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం గోల్డ్ ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ కూడా 22 క్యారెట్స్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పులేకపోయినప్పటికీ, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ మాత్రం రూ. 80 తగ్గింది. ఇక ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు..
ఇక వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,950కాగా, ముంబైలో రూ. 69,950 , బెంగళూరులో రూ. 72,000 , చెన్నైలో రూ. 72,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,000 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 72,000 వద్ద కొనసాగుతోంది.