Railway News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! త్వరలో నెలవారీ పాస్‌ల సేవలు ప్రారంభం..
Railway Passengers : ప్రస్తుతం రైల్వే నడుపుతున్న అన్ని రైళ్లలో ప్రయాణికులు ముందుగానే టికెట్లు తీసుకోవడం అవసరం. గతంలో

Railway Passengers : ప్రస్తుతం రైల్వే నడుపుతున్న అన్ని రైళ్లలో ప్రయాణికులు ముందుగానే టికెట్లు తీసుకోవడం అవసరం. గతంలో మాత్రం స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకొని ప్రయాణం చేసేవారు. చాలామంది ప్రజలు ముందుగా టికెట్లు తీసుకునే పద్దతి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుకింగ్, ఇతర ఛార్జీల పేరిట టికెట్ కోసం ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.
గతంలో రోజువారీ ప్రయాణికులు ఎంఎస్టీ (మంత్లీ సీజనల్ టికెట్) ద్వారా రాయితీ రేటుతో రైళ్లలో ప్రయాణించేవారు. కానీ కరోనా సమయంలో అన్ని రాయితీ సౌకర్యాలతో పాటు, నెలవారీ పాస్ సౌకర్యం కూడా నిలిపివేశారు. జాతీయంగా పనిచేసే నెలవారీ పాసుల సేవలు గత సంవత్సర కాలంగా వాయిదా వేశారు. అయితే త్వరలో రైల్వేలు ఈ సేవలు ప్రారంభించబోతున్నాయని చెబుతున్నారు. దీంతో రోజువారీ ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి.
ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపారు.. మీడియా నివేదికల ప్రకారం భోపాల్ రైల్వే డివిజన్‌తో సహా మండలంలోని ఇతర డివిజన్లలో నెలవారీ పాస్ హోల్డర్లను సులభతరం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపారు. రాబోయే కొద్ది వారాల్లో దీనిని వారు ఆమోదించవచ్చని తెలుస్తోంది. నెలవారీ పాస్ సౌకర్యం జాతీయ స్థాయిలో ఒకేసారి ప్రారంభమవుతుందని భోపాల్ డిఆర్ఎం ఉదయ్ బోర్వాంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్లీ సీజనల్ టికెట్ అంటే ఏమిటి? సీజనల్ టిక్కెట్లను రైల్వే వివిధ తరగతుల ప్రయాణీకులకు (పిల్లలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు) రాయితీ రేటుకు జారీ చేస్తుంది. ఈ టిక్కెట్లు సబర్బన్, సబర్బన్ కాని విభాగాలకు ఒక నెల, మూడు నెలలు మొదలైన వాటికి జారీ చేస్తారు. సీజన్ టికెట్లు గడువు తేదీ నుంచి 10 రోజుల ముందుగానే పునరుద్దరిస్తారు. ప్రత్యేక రైళ్లు ప్రారంభించిన తర్వాత కూడా ఎంఎస్‌టి సౌకర్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో రోజువారీ ప్రయాణికులు చాలా నష్టపోతున్నారు. దీంతో ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే నెలవారీ పాస్‌లు జారీ చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా సుదూర ప్రయాణానికి, ప్రస్తుతానికి టికెట్ తీసుకోవడం అవసరం.