Bamboo bridge: వరుడు వచ్చే మార్గంలో అడ్డుగా కాలువ.. రాత్రికి రాత్రే వెదురు వంతెన నిర్మించిన గ్రామస్తులు

బీహార్‌లో జరిగిన అనేక వివాహాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఒకసారి వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును...

Bamboo bridge: వరుడు వచ్చే మార్గంలో అడ్డుగా కాలువ.. రాత్రికి రాత్రే వెదురు వంతెన నిర్మించిన గ్రామస్తులు
Bamboo Bridge
Follow us

|

Updated on: Jul 12, 2021 | 9:37 AM

బీహార్‌లో జరిగిన అనేక వివాహాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఒకసారి వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును తన భుజాలపై ఎత్తుకుని వాగు దాటి తన ఇంటికి తీసుకెళ్లాడు. మరోసారి వధువును కుటుంబ సభ్యులు పడవలో అత్తారింటికి పంపారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇది మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఘటన బీహార్‌లోని అరరియాలోని ఫుల్సర గ్రామానికి చెందినది. తమ గ్రామం అమ్మాయిని చేసుకునేందుకు వచ్చే వరుడు, అతడి బంధువర్గం కోసం రాత్రికి రాత్రే కాలువపై వెదురు వంతెన నిర్మించారు గ్రామస్థులు. పొద్దుకూకే సమయంలో లేని వంతెన.. సూర్యోదయం కల్లా ప్రత్యక్షమైంది. సదరు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో, కాలువ గుండా వివాహాది శుభకార్యాలకు బంధు మిత్రులు వచ్చే అవకాశం తక్కువ. అందుకే అక్కడ పెళ్లిళ్లు ఎక్కువ జరగవు.  గ్రామస్తులు తమ కుమార్తెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం జరిపించేవారు. అటువంటి పరిస్థితుల్లో తాజాగా గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారిని ఫోర్బెస్గంజ్ బ్లాక్ లోని రామాయి గ్రామానికి చెందిన అమరేంద్రకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు.

పెళ్లి తేదీ వరకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి, కాని వధువు వైపు ఉన్నవారికి పెద్ద సవాలు ఏంటంటే.. వరుడిని అతడి బంధుమిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం. నలుగురు కూర్చుని ఈ విషయం గురించి చర్చించారు. వెదురు వంతెన నిర్మిస్తే బెస్ట్ అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే నిర్మాణం పూర్తి చేశారు. వంతెన బలంగా లేనప్పటికీ, ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెన సాయంతో కాలువ దాటి గ్రామానికి చేరుకుని వివాహానికి హాజరయ్యారు.

Also Read: భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు !.. ఇప్పుడు అదే జరిగింది

స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు