భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు !.. ఇప్పుడు అదే జరిగింది
భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే...గోదాట్లో దూకిన చావు రాదంటారు ! నిజమే. అతడి విషయంలో అదే నిజమైంది. ప్రాణాలు కాపాడటానికి...
భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు ! నిజమే. అతడి విషయంలో అదే నిజమైంది. ప్రాణాలు కాపాడటానికి ఏమాత్రం అవకాశం లేని చోట అతడికి ప్రాణం పోశారు. పైన బ్రిడ్జ్…. కింద గోదావరి. చుట్టూ పెద్దగా జనం కూడా లేరు. ఇంకే ముంది ఇదే కరెక్ట్ స్పాట్ సూసైడ్ చేసుకోవడానికి అనుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి – బోడసకుర్రు బ్రిడ్జిపై నుండి గోదాట్లో దూకాడు. ఇంత వరకు బాగానే ఉంది. అతను అనుకున్నట్లుగానే జరిగింది. కాని వెంటనే ఏపీ టూరిజం శాఖ సిబ్బంది ఇలా ఆత్మహత్య చేసుకునే వాళ్లను కాపాడేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది గోదావరిలో దూకిన వ్యక్తిని నీళ్లలోంచి బయటకు తీసి…బోట్ అంబులెన్స్‌లో ఒడ్డుకు చేర్చారు.
అతడిని పిండి రవిశంకర్ శాస్త్రిగా గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడు దేవాలయంలో పౌరహిత్యం చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడ్డ రవిశాస్త్రి.. భారీగా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికివెళ్లి తల్లిదండ్రుల్ని అడగడంతో వాళ్లు ఈ యువకుడ్ని మందలించారు. అంతే మనస్థాపానికి గురై గోదావరిలో దూకాడు. రవిశాస్త్రిని కాపాడిన ఏపీ టూరిజం సిబ్బంది, పోలీసులు తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సమాచారమిచ్చారు. ఎక్కువ సేవు నీళ్లలో ఉండటంతో అపస్మారస్థితిలోకి వెళ్లిన రవిశాస్త్రిని 108లో అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read: స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు