Assam Police : ఆమ్మో పోలీసోళ్లు ! 40 రోజుల్లో 20 కాల్పుల ఘటనలు..అస్సాంలో ‘పోటెత్తిన’ ఫేక్ ఎన్‌కౌంటర్లు ?

అస్సాం పోలీసులు ఫేక్ ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఓ అడ్వొకేట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని

Assam Police : ఆమ్మో పోలీసోళ్లు ! 40 రోజుల్లో 20 కాల్పుల ఘటనలు..అస్సాంలో 'పోటెత్తిన' ఫేక్ ఎన్‌కౌంటర్లు ?
20 Shootings In 40 Days In Assam Advocate Complaint To Nhrc
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 12, 2021 | 11:44 AM

అస్సాం పోలీసులు ఫేక్ ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఓ అడ్వొకేట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. జూన్ 1 నుంచి ఇవి మొదలయ్యాయని, కస్టడీలో ఉన్నవారినో.. లేదా రైడ్స్ నిర్వహిస్తున్నప్పుడో ఇవి జరుగుతున్నాయని, విచక్షణా రహితంగా ఖాకీలు కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోందని ఆరిఫ్ అనే ఆ లాయర్ పేర్కొన్నారు. ఆదివారం ఒక్క రోజే నాగౌన్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయని, జైనల్ అభేదిన్ అనే డెకాయిట్ ని కాల్చి చంపారన్నారు. ఆ నిందితుడు పలు హత్య, హత్యా యత్నాలు, దోపిడీలు తదితర నేరాల్లో పేరుమోసిన క్రిమినల్ అని పోలీసులు తెలిపారన్నారు. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. తన సహచరులతో కలిసి ఆ డెకాయిట్ తమపై కాల్పులు జరిపాడని, లొంగి పోవలసిందిగా కోరినా వినకుండా పారిపోవడానికి యత్నించినప్పుడు తాము ఫైర్ చేశామంటున్నారు.కాగా-40 రోజుల్లో 20 కాల్పుల ఘటనలు జరిగాయని ఆ లాయర్ వివరించారు..

అయితే పశువుల దొంగలు, చిల్లర దొంగతనాలు చేసేవారిని కూడా పోలీసులు ఫైర్ చేస్తూ ఎన్ కౌంటర్లో మరణించారని చెబుతున్నారని, ముఖ్యంగా మైనారిటీలను వారు తమ టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరిఫ్ తన ఫిర్యాదులో తెలిపారు. ఇలాంటి ఘటనలు అస్సాంలో చాలా జరుగుతున్నాయని, ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కస్టడీనుంచి పారిపోతున్న క్రిమినల్స్ పై పోలీసులు కాల్పులు జరపవచ్చునని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఇటీవల జరిగిన పోలీసు మీట్ లో చెప్పినప్పటి నుంచి ఈ విధమైన ఫేక్ ఎన్ కౌంటర్లు పెరిగినట్టు ఆ లాయర్ వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి  : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021

 బూతులు తిడుతున్నారు..సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు..:Mohan Babu Video.

 వకీల్ సాబ్ అడిగిన లాజిక్ నిజం చేసిన హైదరాబాద్ పోలీసులు..ఒకరి కోసం మరొకరు చేసిన ప్రాణ త్యాగం వృధా అవ్వలేదు:Hyderabad Traffic Police Video.

 బౌండరీ లైన్ వద్ద సూపర్బ్ క్యాచ్ వారేవా హర్లీన్..!వైరల్ అవుతున్న వీడియో..:Harleen’s stunning catch video.