పాండియన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు.. తిప్పికొట్టిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్..
పాండియన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాండియన్‌పై వస్తున్న విమర్శలను బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కొట్టిపడేశారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న వీకే పాండియన్‌పై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించారు BJD చీఫ్ నవీన్ పట్నాయక్. సుదీర్ఘకాలం ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వయసు రిత్యా నవీన్ పట్నాయక్ సీఎం పదవికి అనర్హుడన్న బీజేపీ ప్రచారాన్ని ఓటర్లు స్వాగతించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజూ జనతాదళ్ పార్టీని ఓడించి బీజేపీకి అవకాశం కల్పించారు ఒడిశా ప్రజలు.
పాండియన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాండియన్‌పై వస్తున్న విమర్శలను బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కొట్టిపడేశారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న వీకే పాండియన్‌పై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించారు BJD చీఫ్ నవీన్ పట్నాయక్. సుదీర్ఘకాలం ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వయసు రిత్యా నవీన్ పట్నాయక్ సీఎం పదవికి అనర్హుడన్న బీజేపీ ప్రచారాన్ని ఓటర్లు స్వాగతించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజూ జనతాదళ్ పార్టీని ఓడించి బీజేపీకి అవకాశం కల్పించారు ఒడిశా ప్రజలు. ఇక ఎన్నికలు ముగిసినా ఇతర పార్టీల నేతలు వీకే పాండియన్‌పై చేస్తున్న తీవ్ర విమర్శలకు నవీన్ చెక్ పెట్టారు. పాండియన్ బీజేడీలో చేరినప్పటికీ.. అతనికి ఎలాంటి పదవి లేదన్నారు. అయినప్పటికీ.. విద్య, వైద్యం, క్రీడా రంగాలతో పాటు ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల కోసం పాండియన్ సేవలు అందించి రాష్ట్రప్రభుత్వానికి సహకరించారని తెలిపారు.
అలాగే సైక్లోన్లు, కొవిడ్ సమయంలో పాండియన్ అద్భుతమైన పనితీరు చూపారని కొనియాడారు. ఆయన ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి అని, అందుకు ఆయన్ను గౌరవించాలన్నారు. తన వారసుడు ఎవరు అని అడిగిన ప్రతిసారీ పాండియన్ కాదని చెప్పానన్నారు నవీన్ పట్నాయక్. ఆవిషయంలో మళ్లీ స్పష్టత ఇస్తున్నట్లు తెలిపారు. ఒడిశా ప్రజలే తన వారసుడిని నిర్ణయిస్తారని నవీన్ స్పష్టంచేశారు. చాలాకాలం తర్వాత ఓటమిని ఎదురుచూసిన తమ పార్టీ.. ప్రజల తీర్పును గౌరవిస్తుందన్నారు. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలు తన కుటుంబమని, అధికారం లేకపోయినా వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు నవీన్. దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత బీజేడీ ఓటమిపాలైంది. బీజేడీని ఓడించి బీజేపీ విజయాన్ని దక్కించుకుంది. బీజేడీ ఓటమి తర్వాత పాండియన్ మీడియా నుంచి అదృశ్యమైపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బీజేడీ చీఫ్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉండే పాండియన్ ఓటమి తర్వాత లేకపోవడంపై ఇతర పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..