AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నమో 3.0.. నేడే ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రముఖులు..

సండే.. బిగ్‌ డే. ఇవాళే ప్రధానిగా వరసుగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారోత్సవం. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7గంటల 15 నిమిషాలకు  ప్రధానిగా మోదీతో పాటు ఐదారుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.  సంబరాలు అంబరన్నంటేలా వేడుకలు మొదలయ్యాయి.  నమో పట్టాభిషేకానికి దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులు తరలి వస్తున్నారు.  ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆత్మనిర్భర్‌ ప్రతీక.. వికసిత్‌ భారత్‌ పతాక.. నవభారత్‌ భాగ్య విధాత.. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్‌.. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణాస్వీకారమహోత్సవం నేడే.

PM Modi: నమో 3.0.. నేడే ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రముఖులు..
Pm Modi
Srikar T
|

Updated on: Jun 09, 2024 | 7:14 AM

Share

సండే.. బిగ్‌ డే. ఇవాళే ప్రధానిగా వరసుగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారోత్సవం. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7గంటల 15 నిమిషాలకు  ప్రధానిగా మోదీతో పాటు ఐదారుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.  సంబరాలు అంబరన్నంటేలా వేడుకలు మొదలయ్యాయి.  నమో పట్టాభిషేకానికి దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులు తరలి వస్తున్నారు.  ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆత్మనిర్భర్‌ ప్రతీక.. వికసిత్‌ భారత్‌ పతాక.. నవభారత్‌ భాగ్య విధాత.. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్‌.. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణాస్వీకారమహోత్సవం నేడే. జూన్ 9 ఆదివారం.. సాయం సమయం.. సరిగ్గా రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం.  దేశమంతా వేడుక. ఈ మహోతన్నత ఘట్టానికి రాష్ట్రపతి భవన్‌ వేదిక అయింది. నమో 3.0  లేటెస్ట్‌ వెర్షన్‌ విత్‌ అలియెన్స్‌‎తో ముందుకు వస్తున్నారు మోదీ. ప్రపంచమంతా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. ప్రధానిగా మూడోసారి మోదీ పట్టాభిషేకం.. యావత్‌ ప్రపంచానికి  శాంతి, స్నేహ సంకేతాల్ని చాటింది.  స్నేహ సారధిగా భారత్‌ పంపిన ఆహ్వానాలతో సార్క్‌ దేశాల అధినేతలు, ప్రముఖులు, ప్రతినిధులు మోదీ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు తరలి వచ్చారు.

ప్రధానిగా మోదీతో పాటు మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బిజేపీ నుంచి ఐదుగురు.. మిత్రపక్షాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్‌లో ఛాన్స్‌ వుంటుందని తెలుస్తోంది. ఐతే  సంకీర్ణ సర్కార్‌గా బలనిరూపణ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్‌ కూర్పు ఉండే అవకాశం వుంది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి భవన్‌లో అద్వితీయ ఏర్పాట్లు చేస్తున్నారు. నమో ప్రమాణోత్సవం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది.  ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ ఢిల్లీలో హై అలెర్ట్‌ కొనసాగుతోంది. చీమ చిటుక్కుమన్న గుర్తించేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలీజెన్స్‌తో  సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.  సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో ఢిల్లీని జల్లెడ పడుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆది, సోమవారం రెండు రోజులు ఢిల్లీని నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌ లోపల, బయట మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు, విశిష్ట అతిథులు బస చేసిన హోటల్‌ దగ్గర సెక్యూరిటీని పటిష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి  రాష్ట్రపతి భవన్‌ ముస్తాబైంది. ప్రమాణస్వీకారానికి ముందు మోదీ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. ప్రమాణ స్వీకారం తరువాత వారణాసికి వెళ్లి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి