AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2024: ఒకే పరీక్ష సెంటర్‌లో ఆరుగురికి సేమ్ మార్కులు.. పెద్ద దుమారం.. రోడ్లెక్కిన విద్యార్థులు

ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 67మందికి టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురికి సేమ్ మార్కులు. 67మందికి ఫస్ట్ ర్యాంక్.. ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. వింటుంటే మీక్కూడా ఎక్కడో తేడా కొడుతోంది కదా!. నీట్ ర్యాంకులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలు జరిగాయని పెద్దఎత్తున దుమారం రేగుతోంది. విద్యార్థులు..

NEET UG 2024: ఒకే పరీక్ష సెంటర్‌లో ఆరుగురికి సేమ్ మార్కులు.. పెద్ద దుమారం.. రోడ్లెక్కిన విద్యార్థులు
Neet Ug 2024
Subhash Goud
|

Updated on: Jun 08, 2024 | 6:18 PM

Share

ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 67మందికి టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురికి సేమ్ మార్కులు. 67మందికి ఫస్ట్ ర్యాంక్.. ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. వింటుంటే మీక్కూడా ఎక్కడో తేడా కొడుతోంది కదా!. నీట్ ర్యాంకులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలు జరిగాయని పెద్దఎత్తున దుమారం రేగుతోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ఫలితాల్లో ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో అనేకానేక డౌట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు నీట్‌ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. కానీ, ఈసారి 67 మంది టాపర్లుగా నిలవడం, ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరేషాన్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. రీఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రచ్చరచ్చ జరుగుతుంటే.. ఈ ఎగ్జామ్ నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మాత్రం ఎలాంటి అవతకవకలకు ఛాన్సే లేదంటోంది.

నీట్ ఎగ్జామ్ పారదర్శకంగా జరిగిందన్నారు నేషనల్‌ టెస్టింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ జనరల్ సుబోధ్. ఎలాంటి పేపర్‌ లీక్‌ కాలేదని క్లారిటీ ఇచ్చారాయన. వారంలోగా విచారణ ప్రక్రియ కొలిక్కి వస్తుందని.. అడ్మిషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూస్తామన్నారు.

నీట్ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇందులో అవకతవకలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో తెలంగాణ‌ నుంచి ఒక్క విద్యార్థి కూడా నీట్‌ టాప్ 5 ర్యాకింగ్‌లో లేరని.. కచ్చితంగా అక్రమాలే కారణమని నమ్ముతున్నామన్నారు కేటీఆర్. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్‌పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలు బయటపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

నీట్‌ పరీక్షలో అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో  చెలగాటమాడొదన్నారు. నీట్ ఎగ్జామ్‌లో కూడా అక్రమాలు జరిగితే.. అర్హతలేని వారు డాక్టర్లు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలే కాదు..దేశానికి ముప్పంటున్నారు. నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్డీతో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.