AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Group-1 Prelims Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు అలర్ట్.. బస్సెక్కితే చాలు సెంటర్‌కు సేఫ్‌గా వెళ్లినట్లే.. TGSRTC కీలక ప్రకటన..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది.. ఆదివారం (జూన్ 9 2024) జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది.

Group-1 Prelims Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు అలర్ట్.. బస్సెక్కితే చాలు సెంటర్‌కు సేఫ్‌గా వెళ్లినట్లే.. TGSRTC కీలక ప్రకటన..
Group 1 Prelims
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2024 | 1:03 PM

Share

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది.. ఆదివారం (జూన్ 9 2024) జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేసి వెల్లడించారు.

గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం #TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగిందని సజ్జనార్ తెలిపారు.

రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారన్నారు.

రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో ‘May I Help You’ కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వారికీ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని వివరించారు.

ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాయాలని కోరుతూ.. అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..