JEE Advanced 2024 Toppers List: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే!

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను ఆదివారం (జూన్‌ 9) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రకటించింది. మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన మొదటి 2,80,200 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 40వేల మంది విద్యార్ధులు పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు..

JEE Advanced 2024 Toppers List: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే!
JEE Advanced 2024 Toppers List
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2024 | 1:35 PM

న్యూఢిల్లీ, జూన్‌ 9: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను ఆదివారం (జూన్‌ 9) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రకటించింది. మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన మొదటి 2,80,200 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 40వేల మంది విద్యార్ధులు పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్ 1, పేపర్ 2 ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థి మార్కులతోపాటు కామన్ ర్యాంక్ జాబితా (CRL), కేటగిరీ వైజ్‌ ర్యాంక్ జాబితాను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు కూడా పెరిగాయి. తాజా ఫలితాల్లో మొత్తం 48,248 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. వీరిలో 7,964 మంది అమ్మాయిలు ఉండటం విశేషం. కాగా గతేడాది 43,773 మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను క్లియర్ చేశారు. ఇక ఈ ఏడాది ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు పెరిగాయి. జనరల్‌ కేటగిరికి 93.23 శాతం, ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ కేటగిరికి 79.6 శాతం, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరికి 81.3 శాతం, ఎస్సీ కేటగిరికి 60 శాతం, ఎస్టీ కేటగిరికి 46.69 శాతంగా నిర్ణయించారు.

తాజా ఫలితాల్లో IIT ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి అనే విద్యార్ధి 360 మార్కులకు గానూ 355 సాధించి కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో ఫస్ట్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఆదిత్య 360 మార్కులకు 346 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ 338 మార్కులతో టాప్‌ 3 ర్యాంకు సాధించాడు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా విడుదలైంది. జోసా కౌన్సెలింగ్‌ రేపట్నుంచి అంటే జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 44 రోజులపాటు జోసా కౌన్సెలింగ్‌ కొనసాగుతుంది. జులై 23వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.