CBSE Supplementary Exam 2024: సీబీఎస్సీ 10, 12 తరగతుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్సీ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు జులై 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జులై 15, 16, 18, 19, 20, 22 తేదీల్లో 10వ తరగతి పరీక్షలు..
న్యూఢిల్లీ, జూన్ 9: సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్సీ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు జులై 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జులై 15, 16, 18, 19, 20, 22 తేదీల్లో 10వ తరగతి పరీక్షలు, జులై 15వ తేదీన 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షలు ఒకే ఒక్క రోజు నిర్వహిస్తారన్నమాట. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2023-24 విద్యాసంవత్సరం సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉంటాయని బోర్డు పేర్కొంది.
సీబీఎస్సీ 10, 12 తరగతుల సప్లిమెంటరీ పరీక్షల 2024 షెడ్యూల్..
- సీబీఎస్సీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూలై 15న సోషల్ సైన్సెస్ పేపర్‌తో ప్రారంభమవుతాయి.
- జూలై 16న హిందీ కోర్సు A , కోర్సు B
- జూలై 18న సైన్స్
- జూలై 19న మ్యాథమెటిక్స్
- జూలై 20న ఇంగ్లిష్ – కమ్యూనికేటివ్ అండ్ ల్యాంగ్వేజ్, లిటరేచర్
- జూలై 22న కంపార్ట్‌మెంట్ పరీక్షలు అంటే సంస్కృతం, తమిళం, తెలుగు, మరాఠీ, మణిపురి మరియు బోడోతో సహా కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్లకు పరీక్షలు జరుగుతాయి
సీబీఎస్‌ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా 10వ తరగతిలోని అన్ని పేపర్లు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి. కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ రెండు గంటల వ్యవధిలో జరుగుతుంది. ఈ పేపర్ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది.12వ తరగతి పేపర్లలో చాలా వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయి.
కాగా సీబీఎస్సీ 10, 12 తరగతుల ఫలితాలు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో 93.60 శాతం, 12వ తరగతిలో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.