Rare Leopard: గులాబీ రంగు చర్మంతో కనిపించిన చిరుత పులి.. ఎక్కడంటే..
గులాబీ రంగుతో ఉన్న పులిని స్థానికులు గుర్తించారు. ఇండియాలో పింక్ కలర్ చర్మంతో ఉన్న చిరుత పులి కనిపించడం ఇదే మొదటిసారి..

గులాబీ రంగుతో ఉన్న పులిని స్థానికులు గుర్తించారు. ఇండియాలో పింక్ కలర్ చర్మంతో ఉన్న చిరుత పులి కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇది కెమెరా కళ్లల్లో చిక్కడం మొదటిసారైనప్పటికీ గతంలో చాలాసార్లు గులాబీ రంగు పులిని ప్రత్యక్షంగా చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న జాతి పులుల్లో ఇది అరుదైన జాతి పులి అని డీసీఎఫ్(డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్) ఫతేసింగ్ రాథోడ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నాలుగు రోజులు శోధించి ఫొటో తీశాం.. ‘2012, 2019 సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా అడవుల్లో ఇలాంటి గులాబి చర్మం చిరుత పులులను మొదటిసారిగా గుర్తించారు. రాజస్థాన్‌లో కనిపించిన పులి వయసు 5- 6 ఏళ్లు ఉంటాయి. రణక్‌పూర్, కుంభాల్ ఘర్ గ్రామస్తులు చాలాసార్లు ఈ పులిని చూసినట్లు చెబుతున్నారు. అయితే మాకెప్పుడూ కనిపించలేదు. నాలుగు రోజుల పాటు ప్రయత్నిస్తే కానీ ఈ పులి ఫొటో మా కెమెరా కళ్లకు దొరకలేదు’ అని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ హిమేశ్ మెత్వానీ తెలిపారు.
Rare pink leopard sighted in Ranakpur hills of Rajasthan (For global #wildlife #news, visit #wildtrails at https://t.co/qdysMKANMv) pic.twitter.com/XE34LVcgBb
— WildTrails.in (@_WildTrails) November 10, 2021
Also Read:
Fact Check: భారత రెజ్లర్ నిశా దాహియా కాల్చి చంపినట్లు వార్తలు.. అసలు నిజం ఇది..




