Fact Check: భారత రెజ్లర్ నిశా దాహియానిని కాల్చి చంపినట్లు వార్తలు.. అసలు నిజం ఇది..
హర్యానాలోని సోనిపట్‌లో దారుణం జరిగినట్లు... అంతర్జాతీయ రెజ్లర్ నిశా దాహియాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
హర్యానాలోని సోనిపట్‌లో దారుణం జరిగినట్లు… అంతర్జాతీయ రెజ్లర్ నిశా దాహియాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఎవరు ఈ వార్తను సర్కులేట్ చేశారో తెలియదు కానీ.. అదేదో దగ్గరుండి చూసినట్లు… సుశీల్‌కుమార్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా నిశాతో పాటు ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వార్త పూర్తిగా ఫేక్. ఆమె చాలా సేఫ్‌గా ఉంది. తాను చాలా క్షేమంగా ఉన్నానని.. సీనియర్ లెవల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు గోండాకు వెళ్లినట్లు తెలిపింది.
View this post on Instagram
కాగా నిశా దాహియా గత వారం ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు నిశా దాహియాకు అభినందనలు తెలిపారు. అయితే నిషాను ఇలా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు ఒక్కసారిగా వార్తలు రావడంతో.. అటు రెజ్లర్లు, ఇటు ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. కాగా నిషా దహియాను అభినందిస్తూ ప్రధాని మోదీ ఇవాళే ట్వీట్ చేశారు. ప్రపంచఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటినందుకు అభినందించారు.
Also Read: విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్