Virat Kohli: విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాదీ అరెస్ట్‌ కావడం సంచలనం రేపుతోంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌
Kohli Daughter
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2021 | 8:03 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాదీ అరెస్ట్‌ కావడం సంచలనం రేపుతోంది. టీ-20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓటమి తరువాత కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని ఫోన్లో బెదిరించాడు హైదరాబాద్‌కు చెందిన అలిబత్తిని రాంనాగేశ్‌. 23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్‌ సమీకి సపోర్ట్‌ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్‌.

పాకిస్థాన్​, చేతిలో ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు. ప్రధానంగా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పేసర్ మహ్మద్​ షమీలను టార్గెట్ చేశారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమీకి కోహ్లీ అండగా నిలవడంతో కోహ్లీపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.  మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు.  అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమీషన్. అతి చేసినవారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని.. వారి తాట తీసి ఎఫ్‌ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రాంనాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాంనాగేశ్‌

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాంనాగేశ్‌ ఈ పాడు పనిచేసినట్టు ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. బీటెక్‌ పూర్తి చేసిన రాంనాగేశ్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. టీ-20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఓటమి తరువాత టీమిండియాపై సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్స్‌ వచ్చాయి. పేస్‌బౌలర్‌ మహ్మద్‌ షమీని టార్గెట్‌ చేస్తూ చాలామంది విమర్శించారు. అయితే ఓటమి బాధ్యత షమీ ఒక్కడిదే కాదని , అందరిదని అతడికి సపోర్ట్‌ ఇచ్చాడు కెప్టెన్‌ కోహ్లి. ఇది జీర్ణించుకోలేని ప్రబుద్దులు కొందరు కోహ్లిని కూడా టార్గెట్‌ చేశారు. ట్విట్టర్‌లో విరాట్‌ కోహ్లిని బెదిరిస్తూ కామెంట్స్‌ పెట్టిన రాంనాగేశ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టిన తరువాత తన ఖాతాను డిలిట్‌ చేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్‌ నుంచి ఆ ఖాతా ఆపరేట్‌ అవుతున్నట్టు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ముంబై పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆటలో గెలుపు ఓటములు సహజమన్న విషయాన్ని మరిచి ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని పసిపాపను ఈ వ్యవహారంలోకి లాగారు.

Also Read:  ఏపీలో మందుబాబులకు షాక్.. ఎక్సైజ్ శాఖ కొత్త జీవో

నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్