Anand Mahindra: వారితో పాటు అవార్డు తీసుకోవడం గొప్పగా ఉంది.. ఆనంద్ మహీంద్రా..

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు సోమవారం వాణిజ్యం, పరిశ్రమల రంగంలో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. అట్టడుగు స్థాయిలలో కృషి చేస్తున్న వ్యక్తులతో పాటు గౌరవం పొందడం గొప్పగా భావిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు...

Anand Mahindra: వారితో పాటు అవార్డు తీసుకోవడం గొప్పగా ఉంది.. ఆనంద్ మహీంద్రా..
Anand
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 10, 2021 | 7:00 PM

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు సోమవారం వాణిజ్యం, పరిశ్రమల రంగంలో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. అట్టడుగు స్థాయిలలో కృషి చేస్తున్న వ్యక్తులతో పాటు గౌరవం పొందడం గొప్పగా భావిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల ఆకృతిలో చాలా కాలంగా మార్పు చేసిందని, “అట్టడుగు స్థాయిలలో సమాజ అభివృద్ధికి కీలకమైన కృషి చేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించింది” అని మహీంద్రా మంగళవారం ట్వీట్ చేశారు. “నేను నిజంగా వారి ర్యాంక్‌లలో ఉండటానికి అనర్హుడనని భావించాను” అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అన్నారు.

30 వేలకు పైగా మొక్కలు నాటిన పద్మశ్రీ విజేత, కర్ణాటక పర్యావరణవేత్త తులసి గౌడపై చేసిన ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. 77 ఏళ్ల హలక్కీ తెగకు చెందిన వ్యక్తి మొక్కలు, మూలికల గురించి అపారమైన జ్ఞానంతో “అటవీ ఎన్‌సైక్లోపీడియా”గా పేరుపొందారు. మహీంద్రా గ్రూప్ దేశీయంగా, అంతర్జాతీయంగా ఆటోమొబైల్ నుంచి ఐటి, ఏరోస్పేస్ వరకు ప్రధాన పారిశ్రామిక రంగాల పరిధిలోకి విస్తరించిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో పద్మ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. అయితే COVID-19 ప్రోటోకాల్‌ల కారణంగా, సోమవారం అవార్డులు పంపిణీ చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 119 మంది పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ జాబితాలో ఏడు పద్మవిభూషణ్, 10 పద్మభూషణ్ 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.

Read Also.. Live Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన మహిళ.. కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?