Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన మహిళ.. కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది..

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ట్రాక్‎లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వాడకుండా పట్టాలు దాటాలని చూస్తారు. ఇలా ప్రమాదాలకు గురువుతారు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు...

Viral Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన మహిళ.. కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది..
Train
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 10, 2021 | 6:59 PM

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ట్రాక్‎లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వాడకుండా పట్టాలు దాటాలని చూస్తారు. ఇలా ప్రమాదాలకు గురువుతారు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కిందపడిపోతారు. అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు తిగుతారు. ఇది కూడా ప్రమాదమే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ కదిలే రైలు నుంచి దిగుతుండగా ట్రైన్ కింద పడే క్రమంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‎లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ఓ మహిళ దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోయింది. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలు వెళ్తుంది. అప్పుడు అందులో నుంచి ఓ గర్భణీ దిగేందుకు యత్నించింది. కానీ పట్టు తప్పి రైలు, ప్లాట్‎ఫారమ్ మధ్య పడిపోతుండగా.. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ క్షణాల్లో స్పందించి కాపాడాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‎లో సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శివాజీ M సుతార్ ఈ సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీని ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీ ఎస్ఆర్ ఖండేకర్ కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలును దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జారిపడిన గర్భిణీ స్త్రీని కాపాడారు” అని సుతార్ సోమవారం పోస్ట్ చేశారు. “ప్రయాణికులు రన్నింగ్ రైల్లో ఎక్కవద్దు లేదా దిగవద్దు అని రైల్వే విజ్ఞప్తి చేస్తుంది,” అని తెలిపారు.

Read Also.. Viral Video: స్నేక్ రెస్క్యూ ఆపరేషన్… మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా

పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?