Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్నేక్ రెస్క్యూ ఆపరేషన్… మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. అలాంటివారు పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు. వా

Viral Video: స్నేక్ రెస్క్యూ ఆపరేషన్... మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా
Snake Rescue
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2021 | 5:39 PM

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. అలాంటివారు పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు. వాస్తవానికి తనకు ఇబ్బంది అనిపించినప్పుడే పాము అవతలి వ్యక్తులను కాటు వేస్తోంది. అయితే కొంతమంది పాము కనిపించిందే తడవుగా కర్రలతో దాడి చేసి.. దాన్ని అంతం చేస్తారు. వాస్తవానికి అన్ని జీవులతో పాటు దానికి కూడా ఈ భూమ్మీద జీవించే హక్కు ఉంది. బలహీన జీవులపై దాడులు చేసి హతమార్చడం కరెక్ట్ కాదని జంతు ప్రేమికుల వాదన. అందుకే పాములు ఎప్పుడైనా జనావాసాల్లోకి వచ్చినా స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వారు దాన్ని జాగ్రత్తగా పట్టి.. అడవుల్లో విడిచిపెడతారు.

ఇక పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు అంటే భయం ఉన్నవాళ్లు సైతం ఆ వీడియోలను చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తారు. తాజాగా ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. అందులో ఓ పామును స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే పామును అదుపుచేసే సమయంలో అది.. తిన్న కప్పను కక్కిన విజువల్ వైరల్ అవుతోంది.

తెలంగాణలోని నందిపేట్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి డేంజరస్ కోబ్రా ఎంటరయ్యింది. బాగా ఆకలితో ఉన్న ఆ స్నేక్.. కప్పను వేటాడి మింగేసింది. పాము తచ్చాడటం గమనించిన..  ఆ ఇంట్లోని వ్యక్తులు స్నేక్ క్యాచర్ మున్నాకు సమాచారం అదిచారం. అతను తన టీమ్‌తో కలిసి వచ్చి.. దాన్ని జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని ఓ డబ్బాలో బంధించాడు. కాగా అతను రెస్క్యూ చేస్తోన్న క్రమంలో పాము గట్టిగా ఊపిరి తీసుకుంటూ, తిన్న కప్పను కక్కేసింది. స్నేక్ క్యాచర్ రానని చెప్తే.. ఆ పామును చంపేవాళ్లమని స్థానికులు తెలిపారు. అయితే పాముకు కూడా అన్ని జీవుల్లానే బ్రతికే హక్కు ఉందని.. ఒకవేళ అనుకోకుండా అని ఇళ్లలోకి వస్తే.. స్నేక్ క్యాచర్స్ లేదా ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ మున్నా కోరుతున్నాడు. కాగా ఈ పాము రెస్క్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

Also Read: విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌

 మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..