Viral Video: డ్యాన్స్‎తో ఇరగదీసిన స్పైస్‎జెట్ ఎయిర్‎హోస్టెర్స్.. వైరల్ అయిన వీడియో..

ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ పాటలు 'మనికే మేజ్ హితే' 'టేక్ ఇట్ ఈజీ ఊర్వశి'పై డ్యాన్స్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి...

Viral Video: డ్యాన్స్‎తో ఇరగదీసిన స్పైస్‎జెట్ ఎయిర్‎హోస్టెర్స్.. వైరల్ అయిన వీడియో..
Dance
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 10, 2021 | 2:56 PM

ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ పాటలు ‘మనికే మేజ్ హితే’ ‘టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’పై డ్యాన్స్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఖాళీ ఫ్లైట్‌లో టచ్ ఇట్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో అప్పట్లో వైరల్‎గా మారింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 72,000 లైక్‌లు, వందలాది కామెంట్‌లు వచ్చాయి.

తాజాగా స్పైస్‎జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి, తన సహోద్యోగిని కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉమా, ఆమె సహోద్యోగి మిక్కీ సింగ్.. జోనితా గాంధీ పాడిన నా నా అనే పంజాబీ పాటకు ఎయిర్ బ్రిడ్జ్ ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిపై నృత్యం చేశారు. ఇది విమానాశ్రయ టెర్మినల్ గేట్ నుంచి విమానం వరకు విస్తరించి ఉన్న ఒక వంతెన. ఉమ, ఆమె సహోద్యోగి పూర్తి స్ఫూర్తితో నా నాకి ఉల్లాసమైన స్టెప్పులు వేశారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Uma Meenakshi (@yamtha.uma)

Read Also.. Video Viral: మొసలితో విన్యాసాలు చేస్తే రెచ్చిపోయింది.. ఇది చూసి ఏమంటారో చెప్పండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌..!