RRR Story: ఆర్ఆర్ఆర్ స్టోరీ పై డౌట్స్… హిలేరియస్ కౌంటర్ ఇచ్చిన చిత్రయూనిట్..

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన

RRR Story: ఆర్ఆర్ఆర్ స్టోరీ పై డౌట్స్... హిలేరియస్ కౌంటర్ ఇచ్చిన చిత్రయూనిట్..
Follow us

|

Updated on: Nov 10, 2021 | 2:12 PM

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక అందుకు తగినట్టుగానే ముందు నుంచి జక్కన ఆర్ఆర్ఆర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్ సినిమాతో చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామా ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ నాటు నాటు వీర నాటు ఫుల్ లిరికల్ సాంగ్‏ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ముందు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలోనే ఇద్దరూ హీరోలకు సంబంధించిన పాత్రలను ఏమాత్రం తక్కువ చేయకుండా.. ఇటు కథను మార్చకుండా సినిమా తెరెకెక్కించినట్లుగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇక మరోవైపు రాజమౌళి ఈ సినిమా కథను మనకు తెలిసింది కాకుండా ఫిక్షన్ నేపథ్యంలో కొత్తగా రూపొందించాం అని చెబుతూనే ఉన్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ పై సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాలు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా నెటిజన్ 1920లో స్వాతంత్ర సమరయోధులు ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్ల తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి చేరుకున్నారని.. కాబట్టి ఈ రెండేళ్లలో ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఆ పార్ట్‏ను ఫిక్షన్‏గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకున్నారు.. మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపిస్తున్నారా అనేది డౌట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఇది చూసిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సదరు నెటిజన్‏కు హిలేరియస్ కౌంటర్ ఇచ్చింది. “ఓరీ మీ దుంపలు తెగ… మీరెక్కడ దొరికారు రా..డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా.. క్లియర్‏గా.. మీకు తెలిసిన స్టోరీ ఇది కూడా సినిమాలో ఉండదు.. మైండ్‏లో నుంచి అవన్ని తీసేసి సినిమాను ఎంజాయ్ చేయండి” అని అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ రియాక్షన్ పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Nayanthara-Shahrukh Khan: షారుఖ్‌ విషయంలో నయనతార కనిపెట్టిందేంటి? నయన్‌కి హెల్ప్ చేసిందెవరు ?

Nora Fatehi: సత్యమేవ జయతే 2 నుంచి కుసు సాంగ్ రిలీజ్.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నోరా ఫతేహి..