Nora Fatehi: సత్యమేవ జయతే 2 నుంచి కుసు సాంగ్ రిలీజ్.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నోరా ఫతేహి..
Nora Fatehi: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ లవర్స్‌కు నోరా ఫతేహి పెద్దగా పరిచయం
Nora Fatehi: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ లవర్స్‌కు నోరా ఫతేహి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నోరా ఫతేహి.. నటిగానే కాకుండా.. డ్యాన్సర్, మోడల్.. సింగర్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అందం… అభినయంతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది నోరా ఫతేహి. ఇక నోరా డాన్స్ మూమోంట్స్కు.. ఆమె వేసే స్టెప్పులకు అభిమానులు ఎక్కువే…. ఇక తెలుగులోనూ నోరా ఫతేహికి అభిమానులు ఎక్కువే ఉన్నారు. టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించడమే కాకుండా.. బాహుబలి సినిమాలోనూ మనోహరి పాటతో ఆకట్టుకుంది..
తాజాగా ఈ అమ్మడు ఆడిపాడిన న్యూ సాంగ్ రిలీజ్ అయింది. జాన్ అబ్రహం.. దివ్య ఖోస్లా ప్రధాన పాత్రలలో నటించిన సత్యమేవ జయతే 2. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కుసు కుసు పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి తనదైనా డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో కుర్రకార మతి పొగొడుతుంది. తన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా… ప్రశంసలు అందుకుంటుంది నోరా. ఇక తాజాగా విడుదలైన కుసు కుసు సాంగ్.. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక సత్యమేవ జయతే 2 సినిమాను టీ సిరీస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్.. అదిరిపోయిన అనసూయ న్యూలుక్..
Anasuya Bharadwaj: అవసరమైతే.. గుండు కొట్టించుకుంటా.. యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్
Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. మానవజాతి అంతరించే సమయం.. రష్మీ గౌతమ్ ఎమోషనల్..