Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్.. అదిరిపోయిన అనసూయ న్యూలుక్..
యాంకర్ అనసూయ...అందం.. అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. నటనకు ప్రాధాన్యమున్న
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ…అందం.. అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ. రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ యాంకరమ్మ.. ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటికి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
She is arrogance and pride personified.
Introducing @anusuyakhasba as #Dakshayani.#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/g7zUutRneX
— Pushpa (@PushpaMovie) November 10, 2021
Also Read: Anasuya Bharadwaj: అవసరమైతే.. గుండు కొట్టించుకుంటా.. యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్
Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. మానవజాతి అంతరించే సమయం.. రష్మీ గౌతమ్ ఎమోషనల్..