Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. మానవజాతి అంతరించే సమయం.. రష్మీ గౌతమ్ ఎమోషనల్..

బుల్లితెరపై రష్మీ గౌతమ్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.... అందం..మాట తీరుతో ప్రస్తుతం ఉన్న

Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. మానవజాతి అంతరించే సమయం.. రష్మీ గౌతమ్ ఎమోషనల్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2021 | 9:09 AM

బుల్లితెరపై రష్మీ గౌతమ్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు…. అందం..మాట తీరుతో ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్స్‏లలో ఒకరిగా కొనసాగుతుంది రష్మీ. ఓవైపు బుల్లితెరపై సత్తా చాటుతూనే.. మరోవైపు వెండితెరపై రాణిస్తుంది రష్మీ. అలాగే.. సోషల్ మీడియాలోనూ.. తన లెటేస్ట్ ఫోటోస్.. అప్డేట్స్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక సమాజంలో జరుగుతున్న ఘటనలపైనూ రష్మీ రియాక్ట్ అవుతుంటుంది. అయితే.. రష్మీ జంతుప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. జంతువులకు ఎలాంటి హాని కలిగిన అస్సలు ఊరుకోదు. గతంలోనూ వీధి కుక్కలపై జరుగుతున్న చికిత్స విషయంలోనూ రష్మీ స్పందించింది..

Rashmi

Rashmi

తాజాగా మరోసారి వీధి కుక్కలపై జరిగిన దాడి విషయంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయ్యింది రష్మీ. ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమ బెంగాల్‏లో దారుణ ఘటన జరిగింది. అందరూ దీపావళి సంబరాలు జరుపుకుంటుండగా.. కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్కపై తమ సైకోయిజాన్ని చూపించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై.. తోక తెగి పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మీ.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందించింది. మానవత్వం చచ్చిపోయింది. ఈ భూమి పై మనవజాతి అంతరించే సమయం వచ్చింది అంటూ ఆ ఘటనకు సంబంధించిన వార్తను పోస్ట్ చేసింది. ఇక ఘటన గురించి తెలిసిన నెటిజన్స్ సైతం ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Samantha: సమంత మంచి మనసు.. హీరోయిన్‏కు అండగ నిలిచిన సామ్..

Adbutham Trailer: ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్.. డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు