Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత మంచి మనసు.. హీరోయిన్‏కు అండగ నిలిచిన సామ్..

సమంత.. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను

Samantha: సమంత మంచి మనసు.. హీరోయిన్‏కు అండగ నిలిచిన సామ్..
Samantha Helped
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2021 | 8:45 AM

సమంత.. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్‏గా మారింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్ర కథనాయికగా కొనసాగుతుంది. అటు హీరోయిన్‏గానే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తి సమంత. ప్రత్యూష ఫౌండేషన్‎ను ప్రారంభించి పిల్లలకు సాయం చేస్తుంది. కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా.. తన తోటి నటీనటులకు కూడా సమంత తనవంతూ సాయాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని హీరోయిన్ తేజస్వి బయటపెట్టింది.

ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పింది. తేజస్వి మడివాడకి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుడికి బానిసైయ్యాడు. దాంతో డబ్బులకు తేజస్వి చాలా ఇబ్బందులు పడేది. ఇక కాస్త వయసు పెరిగిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసి కాలేజీ క్యాంపస్‏లలో.. శరణాలయాల్లో ఉంటూ వచ్చిందట. ఇక అదే సమయంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో పాత్రలకు వచ్చిన డబ్బులు ఆమె అవసరాలకు సరిపోయేవి. దాచుకునేంత డబ్బులు ఏవి మిగల్లేదు. ఈ క్రమంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసే సమయంలో తేజస్వికి టీబీ వచ్చిందట. డాక్టర్స్ తనకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ అందుకు సరిపోయేంత డబ్బులు లేవు. విషయం తెలుసుకున్న సమంత..తేజస్వి ఆపరేషన్‏కు అయ్యే ఖర్చుని తానే భరించినట్లుగా తేజస్వి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో సమంత మంచి మనసు గురించి తెలుసుకున్న అభిమానులు ఆమెను మరింత ప్రశంసిస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి సారించింది. విడాకుల ప్రకటన అనంతరం సామ్.. తన మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి తన సన్నిహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. ఇక సామ్.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. అలాగే సామ్.. బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read: Adbutham Trailer: ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్.. డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో స్ట్రీమింగ్

ఎప్పటినుంచంటే..

Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..