Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్‏.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే తెలుగు, హిందీతోపాటు.. తమిళం..

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2021 | 7:13 AM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్‏.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే తెలుగు, హిందీతోపాటు.. తమిళం.. కన్నడం.. మలయాళం భాషలలోనూ బిగ్‏బాస్‏ రియాల్టీ షో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా దూసుకుపోతుంది. కేవలం బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. బిగ్‏బాస్‏ షోను.. సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తుంటారు అనే సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‏కు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక బిగ్‏బాస్‏ సీజన్ 5లో ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకు తన మద్దతు ఉంటుందని షో ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రకటించాడు మెగా బ్రదర్ నాగబాబు..

ఇక తాజాగా.. తెలుగు బిగ్‏బాస్‏ రియాల్టీ షో పై.. స్పందించాడు రియల్ హీరో సోనూసూద్. లాక్‏డౌన్ సమయంలో ఎంతో మందికి సహయం చేసి…వారికి అండగా నిల్చున్నాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ.. వలస కార్మికులు.. నిరుపేదలకు బాసటగా నిలిచాడు.. ఎంతో మందికి ఆరాద్య దైవంగా మారిపోయాడు. యావత్ దేశవ్యాప్తంగా సోనూసూద్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్.. తెలుగు బిగ్‏బాస్‏ షో గురించి స్పందించాడు.. ప్రస్తుత సీజన్‏లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‏స్టాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే సోనూసూద్ ఇలా బిగ్‏బాస్‏ షోపై స్పందించడంతో అభిమానులు ఒకవైపు ఆశ్చర్యంగానూ.. మరోవైపు సంతోషం వ్యకం చేస్తున్నారు.. బిగ్‏బాస్‏ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను చూస్తున్నారా ? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో..

Also Read: Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూంలో జెస్సీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్..

Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన

Bangarraju: స్వర్గంలో అమ్మాయిలతో చిందులేస్తున్న “బంగార్రాజు”.. ఆకట్టుకుంటున్న లడ్డుండా సాంగ్..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..