AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: స్వర్గంలో అమ్మాయిలతో చిందులేస్తున్న “బంగార్రాజు”.. ఆకట్టుకుంటున్న లడ్డుండా సాంగ్..

సోగ్గాడే చిన్నినాయన..చిత్రంతో కింగ్ నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది.

Bangarraju: స్వర్గంలో అమ్మాయిలతో చిందులేస్తున్న బంగార్రాజు.. ఆకట్టుకుంటున్న లడ్డుండా సాంగ్..
Nagarjuna
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 10, 2021 | 6:41 AM

Share

Bangarraju: సోగ్గాడే చిన్నినాయన..చిత్రంతో కింగ్ నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. అనూప్ రూబెన్స్ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇచ్చిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బంగార్రాజు కోసం మరోసారి అధ్బుతమైన ట్యూన్స్ రెడీ చేశారు. బంగార్రాజు సినిమాతో పాటు పాటల మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన లడ్డుండా పాటకు సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్‌ను అందించారు. నాగార్జున మాటలతో ఈ పాట ప్రారంభం అవుతుంది. తన తబలా, హార్మోనియం రెడీయా అంటూ పాటకు సిద్దమవుతారు. నాగార్జున ప్రత్యేకమైన యాసలో పాడిన పాట, పలికిన పదాలు అందరినీ మెప్పించాయి. పంచెకట్టులో మరోసారి నాగార్జున అందరినీ కట్టిపడేశారు. ఈ పాటలో స్వర్గంలోని దేవ కన్యలతో నాగార్జున డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాగార్జునతో పాటుగా ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియలు ఈ పాటను ఆలపించారు. భాస్కర భట్ల క్యాచీ పదాలతో మంచి సాహిత్యం అందించారు.

బంగార్రాజు పాత్రలో నాగార్జున మరోసారి అందరినీ మెప్పించబోతున్నారు. బంగార్రాజు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం. బంగార్రాజు చిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా ఈ చిత్రంలో కనిపించబోతోన్నారు. మంగళవారం మైసూర్‌ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో బంగార్రాజు చిత్రం రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!