AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను  విడుదల చేయనున్న చిత్రబృందం
Anu
Basha Shek
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 09, 2021 | 10:21 PM

Share

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, నటీనటుల ఫస్ట్‌లుక్స్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకన్నాయి. ఇటీవల ‘మంగళం శీను’ అంటూ సునీల్‌ పాత్రను మనకు పరిచయం చేసిన చిత్రబృందం బుధవారం(నవంబర్‌10) మరో అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమైంది.

ద్రాక్షాయణిగా.. ఈ సందర్భంగా సినిమాలోని అనసూయ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో ‘ద్రాక్షాయణి’ అనే క్యారెక్టర్‌లో ఆమె నటించనుందని, బుధవారం ఉదయం 10.08 గంటలకు ఆమెను పరిచయం చేయనున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. చివరిగా ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అనే సినిమాలో కనిపించిన అనసూయ ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ సినిమాల్లో నటించనుంది.

Also Read:

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్

Teja Sajja: తెలుగులో మరో టైమ్‌ ట్రావెలర్‌ మూవీ.. కాలాలకు అతీతంగా సాగే అందమైన ప్రేమ కథ. అద్భుతం ట్రైలర్ చూశారా..

Anasuya Bharadwaj: ఫ్లాష్‌ బ్యాక్‌ డబ్బింగ్‌ మొదలెట్టిన అనసూయ.. ఫొటోలు పంచుకున్న చిత్ర యూనిట్‌..