Teja Sajja: తెలుగులో మరో టైమ్‌ ట్రావెలర్‌ మూవీ.. కాలాలకు అతీతంగా సాగే అందమైన ప్రేమ కథ. అద్భుతం ట్రైలర్ చూశారా..

Teja Sajja: ఇటీవల తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకు బాగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా టైమ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి సబ్జెక్ట్‌తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కూడా..

Teja Sajja: తెలుగులో మరో టైమ్‌ ట్రావెలర్‌ మూవీ.. కాలాలకు అతీతంగా సాగే అందమైన ప్రేమ కథ. అద్భుతం ట్రైలర్ చూశారా..
Adbutham Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2021 | 9:18 PM

Teja Sajja: ఇటీవల తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకు బాగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా టైమ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి సబ్జెక్ట్‌తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటాయి. గతంలో వచ్చిన ఆదిత్య 369 నుంచి మొన్నటి మొన్న విడుదలైన ‘ప్లే బ్యాక్‌’ సినిమా కూడా ఇదే కథాంశంతో వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో మరో టైమ్‌ ట్రావెలింగ్ మూవీ రాబోతోంది. జాంబిరెడ్డితో హీరోగా మారిన తేజ సజ్జా హీరోగా, రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘అద్భుతం’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఇక ఈ ట్రైలర్‌ను గమనిస్తే టైమ్‌ ట్రావెలింగ్ నేపథ్యంలో కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. రెండు వేరు, వేరు కాలాల్లో ఉన్న అమ్మాయికి, అబ్బాయికి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది.? ఒకే నెంబర్‌ ఇద్దరికి ఉంటే ఏం జరుగుతుంది.? అసలు వీరిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉన్నట్లు ఎలా తెలుసుకున్నారు.?లాంటి అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఈ నెల 19న హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌పై అంచనాలు పెంచేశాయి. మరి ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Indian Bank: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరచుకోవచ్చు.. ఇండియన్‌ బ్యాంక్‌ సరికొత్త సదుపాయం.. పూర్తి వివరాలివే..

NTR Koratala: ఎన్టీఆర్‌ కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.. కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది..

గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..