AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Bank: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరచుకోవచ్చు.. ఇండియన్‌ బ్యాంక్‌ సరికొత్త సదుపాయం.. పూర్తి వివరాలివే..

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు 'ఇండియన్‌ బ్యాంకు' లో ఖాతా తెరవాలనుకునే వారి కోసం ఆ సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది..

Indian Bank: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరచుకోవచ్చు.. ఇండియన్‌ బ్యాంక్‌  సరికొత్త సదుపాయం.. పూర్తి వివరాలివే..
Basha Shek
|

Updated on: Nov 09, 2021 | 8:14 PM

Share

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ‘ఇండియన్‌ బ్యాంకు’ లో ఖాతా తెరవాలనుకునే వారి కోసం ఆ సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు ఖాతా తెరవడానికి తమ బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేకుండా మంగళవారం వీడియో కేవైసీని ప్రారంభించింది. ‘వీడియో బేస్ట్‌ కస్టమర్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రాసెస్‌(VCIP)’ టెక్నాలజీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ క్రమంలో వీడియో కేవైసీ ద్వారా అకౌంట్‌ తెరవాలనుకునేవారు మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌, పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, కెమెరా, మైక్రోఫోన్‌ ఉన్న కంప్యూటర్‌/ ల్యాప్‌టాప్‌తో బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చని సూచించింది. యూఐడీఏఐ నంబర్‌ , ఓటీపీ ఆధారంగా ఖాతాదారుడి వివరాలను ధ్రువీకరిస్తామని పేర్కొంది.

త్వరలోనే అన్ని సేవలకు.. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఏటీఎం కార్డ్‌, చెక్‌బుక్‌, పాస్‌బుక్‌ ఖాతాదారుడి చిరునామాకు నేరుగా వస్తాయని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. అకౌంట్ ఓపెనింగ్‌ సందర్భంగా అవసరమయ్యే కనీసం మొత్తాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే పంపవచ్చని వారు సూచించారు. ఆతర్వాత ఏటీఎం కార్డ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌తో నిరంతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. ‘జియోయ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌’ సంస్థ సహకారంతో ఇండియన్‌ బ్యాంక్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు కేవలం ఖాతా తెరవడానికే వీడియో కేవైసీని ప్రారంభిస్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని సేవలకు విస్తరిస్తామని బ్యాంకు స్పష్టం చేసింది.

Also Read:

Olectra Greentech: అమాంతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం.. సెకండ్ క్వార్టర్‌లో భారీ వృద్ధి..!

PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్‌ కెమెరా.. ధర ఎంతో తెలుసా..?

Follow Us
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్