NTR Koratala: ఎన్టీఆర్‌ కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.. కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది..

NTR Koratala: ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్‌' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది...

NTR Koratala: ఎన్టీఆర్‌ కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.. కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది..
Ntr Koratala Moive
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2021 | 7:43 PM

NTR Koratala: ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌తో పాటు మోహన్‌ లాల్‌ నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన దాదాపు ఐదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలున్నాయి.

నిజానికి ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అందులోనూ ఎన్టీఆర్‌, రాజమౌళి దర్శకత్వలో తెరకెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కూడా పూర్తికాకపోవడం, అటు కొరటాల చిరంజీవితో ఆచార్యతో బిజీగా ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇప్పటికే చాలా గ్యాప్‌ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్‌ వార్త ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతలోపు ఎన్టీఆర్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌, కొరటాల ఆచార్య షూటింగ్ పూర్తిచేసుకొని ఫుల్‌ టైమ్‌ ఇదే సినిమాకు స్పెండ్ చేయనున్నారని టాక్‌. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు అనురుద్‌ సంగీతం అందించనున్నారు. ఇక ఎన్టీఆర్‌ ఈ సినిమాతో పాటు కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో కూడా ఓ సినిమా చేయనున్నారు.

Also Read: VC Sajjanar: అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌పై ఆర్టీసీ అభ్యంతరం.. స్టైలిష్‌ స్టార్‌కు లీగల్‌ నోటీసులు పంపిన సజ్జనార్‌..

Navjot Sidhu: పంతం నెగ్గించుకున్న సిద్ధూ.. పంజాబ్ సీఎం చన్నీతో కుదిరిన సయోధ్య..

Navjot Sidhu: పంతం నెగ్గించుకున్న సిద్ధూ.. పంజాబ్ సీఎం చన్నీతో కుదిరిన సయోధ్య..