Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra: బెయిల్ తర్వాత మొదటిసారిగా కనిపించిన రాజ్ కుంద్రా.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో బిజీబిజీ..

Raj Kundra-Shilpa Shetty: అశ్లీల కంటెంట్ విషయంలో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇప్పుడు రాజ్‌కుంద్రా..

Raj Kundra: బెయిల్ తర్వాత మొదటిసారిగా కనిపించిన రాజ్ కుంద్రా.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో బిజీబిజీ..
Raj Kundra
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2021 | 8:19 PM

Raj Kundra-Shilpa Shetty: అశ్లీల కంటెంట్ విషయంలో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇప్పుడు రాజ్‌కుంద్రా మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు.  తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. రాజ్ భార్య శిల్పాశెట్టితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఈ దంపతులు ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో ఉన్నారు.  అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా తన భార్య శిల్పా శెట్టితో కలిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by ETimes (@etimes)

గత నెలలో రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లను తొలగించినట్లు వార్తలు వచ్చాయి.  ఇన్‌స్టాగ్రామ్ ,  ట్విట్టర్ సహా తన వ్యాపార వ్యక్తిగత ఖాతాలన్నింటినీ తొలగించాలని నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి. ఇక బాలీవుడ్ సీనియర్ నటి రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ఫిట్‌నెస్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులను అలరిస్తూనే ఉంది.  రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జూలైలో అరెస్టయ్యాడు. ముంబైలోని రాజ్ కుంద్రా  కార్యాలయాలపై ముంబై పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న రాజ్ జైలు నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు, 1500 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌లో, ఈ కేసులో కుంద్రా “ప్రధాన  నిందితుడు” అని పేర్కొన్నారు. అంతేకాదు రాజ్ కుంద్రా ఇతర నిందితులతో కలిసి సినీ పరిశ్రమలోని కొంతమంది  యువతులను అసభ్యకరంగా వీడియోలు తీశారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనను ‘బలిపశువు’గా మారుస్తున్నారని,  ఈ ఛార్జిషీట్‌లో తనపై ఒక్క ఆరోపణ కూడా లేదని రాజ్ కుంద్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read:  ఊపిరి తిత్తులే నమూనాగా గాలితో నడిచే ఇంజన్‌ను తయారు చేసిన టీ స్టాల్ యజమాని…