AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VC Sajjanar: అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌పై ఆర్టీసీ అభ్యంతరం.. స్టైలిష్‌ స్టార్‌కు లీగల్‌ నోటీసులు పంపిన సజ్జనార్‌..

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇటీవల నటించిన ర్యాపిడో యాడ్‌పై తెలంగాణ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది...

VC Sajjanar:  అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌పై ఆర్టీసీ అభ్యంతరం.. స్టైలిష్‌ స్టార్‌కు లీగల్‌ నోటీసులు పంపిన సజ్జనార్‌..
Basha Shek
|

Updated on: Nov 09, 2021 | 7:35 PM

Share

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇటీవల నటించిన ర్యాపిడో యాడ్‌పై తెలంగాణ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించడం, కించపరచడాన్ని తప్పుబడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అర్జున్‌తో పాటు ఈ యాడ్‌ రూపొందించిన ర్యాపిడో కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోన్న టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు, అభిమానులు ఎవరూ సహించరని ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే.. ర్యాపిడో రూపొందించిన ఈ ప్రకటనలో అల్లు అర్జున్‌ దోసెలు వేస్తూ ‘అబ్బాయి .. దోసెలు తినాలంటే రెండే చోట్ల.. ఒకటి తన దగ్గర..రెండోది ఆ ఆర్టీసీ బస్సు రూట్లోనే’ అంటూ బస్సును చూపిస్తాడు. ఆతర్వాత ‘అక్కడ మామూలు దోసెలా ఎక్కినోన్ని కూడా కూర్మా, ఖైమా కొట్టి మసాలా దోసె చేసి దింపుతారు’ అంటూ ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో ప్రయాణం చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అర్థం వచ్చేలా మాట్లాడతాడు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను ఎక్కిన ప్రయాణికులను మసాలా దోసెలతో పోల్చడాన్ని టీఎస్‌ఆర్టీసీ తప్పుపట్టింది. ఈక్రమంలోనే అర్జున్‌తో పాటు ర్యాపిడోకు లీగల్‌ నోటీసులు పంపించారు ఎండీ సజ్జనార్‌.Also Read:

Puneeth Raj Kumar: ఇక నుంచి పునీత్ రాజ్ కుమార్ బాటలోనే పయనిస్తానంటున్న గాలి జనార్దన్ రెడ్డి.. పునీత్ జ్ఞాపకార్థం ఏం చేయబోతున్నారంటే..

Unstoppable With NBK: బాలకృష్ణ లైనప్‌ మాములుగా లేదుగా.. అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకేలో తర్వాతి గెస్ట్‌ అతడేనా?

Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్‌ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..