Puneeth Raj Kumar: ఇక నుంచి పునీత్ రాజ్ కుమార్ బాటలోనే పయనిస్తానంటున్న గాలి జనార్దన్ రెడ్డి.. పునీత్ జ్ఞాపకార్థం ఏం చేయబోతున్నారంటే..
Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే హఠాత్తుగా మరణించారు. పునీత్ నటుడిగానే కాదు.. సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు..
Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే హఠాత్తుగా మరణించారు. పునీత్ నటుడిగానే కాదు.. సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు. నిజానికి పునీత్ రాజ్ కుమార్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఆయన మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన సామాజిక కార్యక్రమాలతో సినీ రాజకీయ ప్రముఖులే కాదు.. యావత్ ప్రజానీకం కన్నీరు పెట్టుకుంది.
పునీత్ సంస్మరణ సభలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. బళ్లారిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గాలి జనార్దన్ రెడ్డి , తన అన్నయ్య ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డితో కలిసి పూజలు నిర్వహించారు. పునీత్ కు నివాళిలు అర్పించారు. బెళగల్ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
పునీత్ మరణంతో కన్నడ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని అన్నారు. అందుకనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి బళ్లారిలోనే తాను నివసిస్తానని చెప్పారు. అంతేకాదు.. ఇక నుంచి పునీత్ దారిలోనే తాను ఇక నుంచి పయనిస్తానని.. పలు సేవా కార్యక్రమాలను చేపడతానని చెప్పారు. బళ్లారిలో పునీత్ పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఆసుపత్రి, పాఠశాల నిర్మించేందుకు తన సొంత ఖర్చులతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తానని.. చెప్పారు. పేదలకు వైద్యశాలలో ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడమే తన లక్ష్యమని చెప్పారు. ఆసుపత్రి, పాఠశాలకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
పునీత్‌తో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. నిజానికి నా కొడుకు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు పునీత్ మద్దతు ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. పునీత్ చేసిన సామాజిక కార్యక్రమాలు ఈరోజు అతని పట్ల ప్రజల్లో అపారమైన గౌరవాన్ని మిగిల్చాయి. నేను కూడా పునీత్ నుంచి ప్రేరణ పొందాను .. ఇక నుంచి పునీత్ దారిలోనే పయనిస్తానని అన్నారు.
పునీత్ మరణంపై ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పునీత్ చాలా మంది వ్యక్తి అని.. ఆయన మరణం తీరనిలోటని అన్నారు. తనకు పునీత్ కు ఉన్న రిలేషన్ ను గుర్తు చేసుకున్నారు. బళ్లారిలో రాయల్ బస్టాండ్ కు పునీత్ పేరు పెడతామని ప్రకటించారు.
Also Read: వింత ఆచారం.. ఈ గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వెళ్లాల్సిందే.. ఎక్కడంటే..