AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable With NBK: బాలకృష్ణ లైనప్‌ మాములుగా లేదుగా.. అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకేలో తర్వాతి గెస్ట్‌ అతడేనా?

Unstoppable With NBK: ఓటీటీలో టాక్‌ షో సంప్రదాయాన్ని తెర తీసింది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అంతటితో ఆగకుండా ఏకంగా బాలకృష్ణతోనే టాక్‌ షోను నిర్వహించి మరో అద్భుతానికి తెర తీసింది. అప్పటి వరకు కేవలం..

Unstoppable With NBK: బాలకృష్ణ లైనప్‌ మాములుగా లేదుగా.. అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకేలో తర్వాతి గెస్ట్‌ అతడేనా?
Balakrishna Aha Talk Show
Narender Vaitla
|

Updated on: Nov 09, 2021 | 5:31 PM

Share

Unstoppable With NBK: ఓటీటీలో టాక్‌ షో సంప్రదాయాన్ని తెర తీసింది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అంతటితో ఆగకుండా ఏకంగా బాలకృష్ణతోనే టాక్‌ షోను నిర్వహించి మరో అద్భుతానికి తెర తీసింది. అప్పటి వరకు కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడమే తెలిసిన బాలకృష్ణ తొలిసారి ఇతరులకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆహా వేదికగా అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ప్రసారమవుతోన్న ఈ షోలో ఇప్పటికే తొలి ఎపిసోడ్‌ మంచు మోహన్‌బాబుతో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో మోహన్‌ బాబుతో పాటు లక్ష్మి, విష్ణులు కూడా పాల్గొన్నారు. పదునైన ప్రశ్నలతో మోహన్‌ బాబు నుంచి నిజాలు రాబట్టి బాలకృష్ణ ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే రెండో ఎపిసోడ్‌లో భాగంగా నేచురల్ స్టార్‌ నానిని రంగంలోకి దింపారు బాలయ్య. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆసక్తిని పెంచేసింది. ఇక నానితో జరిగిన ఇంటర్వ్యూను నవంబర్‌ 12న ప్రసారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే అన్‌స్టాబబుల్‌లో పాల్గొనే మూడో కంటెస్టెంట్‌ ఎవరనే దానిపై ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలయ్య బాబు మూడో ఎపిసోడ్‌లో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందాన్ని లైన్‌లో పెట్టనున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ బ్రహ్మానందంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా బాలకృష్ణ గత కొన్ని రోజుల క్రితం చేతికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్లే ఆలస్యమైందంటూ వార్తలు వస్తున్నాయి.  మరి బ్రహ్మానందం నిజంగానే ఈ షోలో పాల్గొననున్నాడా.? లేదా ఇవన్నీ ఫేక్‌ వార్తలేనా తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులకు దూరంగా ఉన్నా.. మీమ్‌ క్రియేటర్స్‌ పుణ్యామాని బ్రహ్మానందం నిత్యం సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు.

Bramhanandam Balakrishna

 

Also Read: T20 World Cup 2021: ఆ దేశ ఆటగాళ్లు రాణిస్తున్నారు.. ఆ జట్టుకే కప్ గెలిచే సత్తా ఉంది..

Anupama Parameswaran: ఇవేం ఎక్స్‌ప్రెషన్లు.! వైరల్ అవుతున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ పిక్స్..

Andhra Pradesh: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. 30 శాతం సిలబస్‌ కుదింపు..