AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ఆ దేశ ఆటగాళ్లు రాణిస్తున్నారు.. ఆ జట్టుకే కప్ గెలిచే సత్తా ఉంది..

ఆరోన్ ఫించ్ అండ్ కోకు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మద్దతు పలికాడు. నవంబర్ 14న దుబాయ్‌లో తమ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకునే సత్తా ఆసీస్‎కు ఉందన్నాడు. ఈ మెగా టోర్నమెంట్‎లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు నిలకడగా క్రికెట్ ఆడిందని గుర్తు చేశాడు...

T20 World Cup 2021: ఆ దేశ ఆటగాళ్లు రాణిస్తున్నారు.. ఆ జట్టుకే కప్ గెలిచే సత్తా ఉంది..
Warne
Srinivas Chekkilla
|

Updated on: Nov 09, 2021 | 5:04 PM

Share

ఆరోన్ ఫించ్ అండ్ కోకు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మద్దతు పలికాడు. నవంబర్ 14న దుబాయ్‌లో తమ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకునే సత్తా ఆసీస్‎కు ఉందన్నాడు. ఈ మెగా టోర్నమెంట్‎లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు నిలకడగా క్రికెట్ ఆడిందని గుర్తు చేశాడు. డేవిడ్ వార్నర్ పుంజుకోవడం కలిసొచ్చే అంశమని చెప్పాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, మార్ష్, స్టొనియిస్, మాక్స్‎వెల్ రాణిస్తే జట్టు గెలవడం ఖాయమన్నాడు. “ఇప్పుడు ఆసీస్ వారి బ్యాటింగ్ ఆర్డర్ సరైన ఫామ్‌ను కలిగి ఉంది. వారు వరల్డ్ కప్ గెలవగలరు. నా ప్రారంభ ప్లేయింగ్ ఎలెవన్‎లో స్మిత్ ఉండేవారు కాదు. కానీ అతడు బాగా ఆడుతున్నాడు. ఆసీస్ త్వరగా వికెట్లు కోల్పోయినా అతను మాత్రం ఆడుతున్నాడు. అతడికి మార్ష్, స్టొనియిస్, మాక్స్‎వెల్ రాణిస్తున్నారు” అని వార్న్ అన్నాడు.

సెమీఫైనల్‎లో ఆస్ట్రేలియాకు గట్టి సవాలు ఎదురవుతుందని చెప్పాడు. ఎందుకంటే పోటీలో ఇప్పటికీ అజేయంగా ఉన్న పాకిస్తాన్‌తో ఆడుతుందని గుర్తు చేశాడు. బాబర్ ఆజం అండ్ కో. భారత్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లను ఓడించి సెమీస్‎కు దూసుకెళ్లిందన్నారు. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను ఓడించిన తర్వాత ఆసీస్ కూడా ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు.

సెమీఫైనల్‎లో టాస్ చాలా ముఖ్యమైనదని తను భావించడం లేదని మిచెల్ మార్ష్ అన్నాడు. ” చాలా జట్లు టాస్ గెలిచినప్పుడు మొదట బౌలింగ్ ఎంచుకుంటాయి. కానీ నేను అక్కడ (దుబాయ్‌లో) ఆడిన రెండు గేమ్‌లు నిజంగా మంచు కురవలేదు” అని మార్ష్ చెప్పాడు. “సహజంగానే, మీరు ముందుగా బ్యాటింగ్ చేసి, పెద్ద స్కోరు నమోదు చేయగలిగితే, బాగా బౌలింగ్ చేస్తే, మీరు గెలవడానికి చాలా దూరం వెళ్తారు. మేము నమ్మకంగా ఉన్నాము. సెమీ-ఫైనల్‌లో ఏదైనా జరగవచ్చు.” అని చెప్పాడు.

Read Also.. Virender Sehwag: కేఎల్ రాహుల్, పంత్ కంటే అతడే బెటర్.. టీ20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..