Virender Sehwag: కేఎల్ రాహుల్, పంత్ కంటే అతడే బెటర్.. టీ20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత టీ20 జట్టులో వైస్ కెప్టెన్సీకి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కంటే బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అన్నాడు....

Virender Sehwag: కేఎల్ రాహుల్, పంత్ కంటే అతడే బెటర్.. టీ20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sehwag
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 09, 2021 | 3:35 PM

భారత టీ20 జట్టులో వైస్ కెప్టెన్సీకి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కంటే బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అన్నాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కొత్త టీ20 కెప్టెన్ రాకతో భారత క్రికెట్ జట్టు కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందన్నారు. కెప్టెన్‎గా రోహిత్ శర్మ పేరు వినబడుతుంది.

అయితే వైస్ కెప్టెన్‎పై కూడా చర్చ కొనసాగుతోంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుండగా సెహ్వాగ్ మాత్రం బుమ్రా పేరును తెరపైకి తెచ్చాడు. అయితే ఈ మధ్యే మాజీ పేస్ బౌలర్ నెహ్రా బుమ్రాను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేశాడు కూడా. బౌలర్ కెప్టెన్‎గా ఉండకూడదని ఏ రూల్ బుక్‎లో రాయలేదన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్‌ కెప్టెన్‎గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ కూడా ఢిల్లీకి కెప్టెన్‎గా చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఏ ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్‎లో నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఫామ్ పరిగణలోకి తీసుకుంటే అభిమానులు, నిపుణుల టీ20 వైస్ కెప్టెన్సీ రేసులో బుమ్రా అగ్రస్థానంలో ఉండాలని సెహ్వాగ్ అన్నాడు. “మీరు మూడు ఫార్మాట్లలో ఆడే వారిని కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్‌గా చేస్తారు. కాబట్టి మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. రేసులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కచ్చితంగా ఉన్నారు.

కానీ వారు మూడు ఫార్మాట్లలో ఆడతారా? వారు జస్ప్రీత్ బుమ్రా వలె నిలకడగా రాణించగలరా?”, అని సెహ్వాగ్ అన్నాడు. “భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‎గా చేయలేదు. కపిల్ దేవ్ కూడా ఆల్ రౌండర్‎గా కెప్టెన్సీ చేశాడు. స్పిన్నర్ కుంబ్లే టెస్టుల్లో కొద్ది కాలం పాటు జట్టును నడిపించాడు. అయితే ప్రస్తుత భారత టీ20 జట్టులో వైస్ కెప్టెన్సీకి బుమ్రాను ఎంపిక చేయాలి.” అని చెప్పాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపిక చేసినా చేయకున్నా బుమ్రా ఖచ్చితంగా వైస్ కెప్టెన్‌గా చేయాలన్నాడు.

Read Also.. T20 World Cup 2021, Ind vs Pak: రికార్డు సృష్టించిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎందులోనో తెలుసా?